శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

గోదారమ్మకు ప్రత్యేక పూజలు
నిజామాబాద్ జిల్లా, అక్టోబర్ 23(way2newstv.com)
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ మూడేళ్ళ తర్వాత   పూర్థిస్థాయి నీటిమట్టంతో జలకళను సంతరించుకుందని  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహారాష్ట్రలో విస్తృతంగా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా నీరు వచ్చి చేరుతుందన్నారు. 
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రబీ సీజన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకింద పంటలు సాగు చేసుకునేందుకు  నీటిని విడుదల చేయడం జరుగుతోందన్నారు. ఖరీఫ్ సీజన్కు సైతం ప్రాజెక్ట్నుంచి వ్యవసాయ భూములకు నీటిని అందించాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండటంతో రైతులకు రెండు పంటలకు నీరందుతుందని చెప్పారు. అంతేకాకుండా  పోచంపాడ్ జెన్ కో కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ యం. ప్రశాంతి, ఎస్సారెస్సీ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ రామారావు, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్, రాంకిషన్ రెడ్డి,  మల్లికార్జున్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సోన్ జడ్పీటీసీ జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.