బిగ్ బాస్ విన్నర్ ఆ ముగ్గురిలో ఒకరేనా

హైద్రాబాద్, అక్టోబరు 16 (way2newstv.com)
బిగ్ బాస్ నారదుడిగా, పుల్లలు పెట్టేవాడిగా పేరొంది 12 వారంలో ఎలిమినేట్ అయ్యాడు మహేష్ విట్టా. ఎలిమినేషన్ అనంతరం హౌస్‌లో జరిగిన విషయాలను పంచుకుంటూ.. బిగ్ బాస్ విన్నర్ అయ్యేందుకు ఎవరికి ఎక్కు వ ఛాన్స్ ఉందో చెప్తున్నాడు.‘నా లెక్క ప్రకారం టైటిల్ విన్నర్ ఎవరన్నది చెప్పలేని పరిస్థితి. అది ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. 
బిగ్ బాస్ విన్నర్ ఆ ముగ్గురిలో  ఒకరేనా

అయితే ఓటింగ్ పరంగా విన్నర్‌ని డిసైడ్ చేస్తే మాత్రం.. వరుణ్, శ్రీముఖి, రాహుల్‌లలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓట్లు కాకుండా వేరే లెక్కలు తీసుకుంటే.. ఈ ముగ్గురు కాకుండా వేరే వాళ్లు విన్నర్ అయ్యే అవకాశం ఉంది.బిహేవియర్‌ని బట్టి విన్నర్‌ని అనౌన్స్ చేస్తారని అయితే నేను అనుకోవడం లేదు. రవిని మంచోడు మంచోడు అనుకునే వాళ్లం తరువాత తెలిసింది మనోడు నటిస్తున్నాడని. అలాగే చాలా మంది హౌస్‌లో ఓపెన్ కావడంలేదు. ఏదో ఒక ఇష్యూని బట్టి ఎవరు విన్నర్ అని డిసైడ్ చేయలేము. అయితే ఉన్నవాళ్లలో శ్రీముఖి, వరుణ్, రాహుల్‌లో ఎవరో ఒకరు విన్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు మహేష్ విట్టా.
Previous Post Next Post