రాజమండ్రిలో ముగ్గురు ఇరగదీస్తున్నారు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజమండ్రిలో ముగ్గురు ఇరగదీస్తున్నారు...

రాజమండ్రి, అక్టోబరు 15, (way2newstv.com)
ముగ్గురూ చిన్న వయస్సులోనే పార్లమెంటు, శాసన సభ్యులు అయిపోయారు. దాంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. పాలన వ్యవహారాలపై ఎలాంటి పట్టు లేకపోవడంతో వారు ఏమి చెబితే అదే రైట్ అనే పరిస్థితి వారిది. ఆ ముగ్గురు నేతలు రాజమండ్రి సిటీ శాసన సభ్యురాలు ఆదిరెడ్డి భవాని ఒకరు కాగా, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు తనయుడు రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా, మరొకరు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గని భరత్ రామ్ కావడం గమనార్హం. భవాని తండ్రి టిడిపి సీనియర్ నేత దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు అలాగే మామగారు ఆదిరెడ్డి అప్పారావు ఎమ్యెల్సీ గా అత్త వీరరాఘవమ్మ మేయర్ గా పనిచేసినా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఇంకా రావడం లేదు. మామ, భర్త సహకారంతోనే ఆమె అడుగులు పడుతున్నాయి.ఇక తల్లి జక్కంపూడి విజయలక్ష్మి దిశా నిర్దేశం లో జక్కంపూడి రాజా నడుస్తున్నారు. 
రాజమండ్రిలో ముగ్గురు ఇరగదీస్తున్నారు...

తండ్రి జక్కంపూడి రామ్మోహన రావు తో సాగిన ప్రయాణంలో విజయలక్ష్మి కి పాలన వ్యవహారాల్లో గట్టి పట్టు వుంది. దాంతో రాజా వ్యవహారాలను ఆమె చక్క బెడుతున్నారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా రాజా ను నియమించడంతో అదనపు బాధ్యతలను రాజా వహిస్తున్నారు. రామ్మోహన్ తో ఉండే సన్నిహిత మిత్రులు సహకారం అందించడానికి కుర్రోడితో జనరేషన్ గ్యాప్ బాగా వచ్చింది. దాంతో జక్కంపూడితో నడిచిన బ్యాచ్ లో మెజారిటీ అనుచరవర్గం రాజాతో అంటి ముట్టనట్లే వుంటున్నారు. ఇప్పుడు రాజా చుట్టూ వున్నది అంతా యువకులే కావడం గమనార్హం. దాంతో అధికార గణం పైకి భక్తి ప్రపత్తులతో నడుస్తున్నా చర్యలను మాత్రం వారికి నచ్చినట్లే నడుపుతున్నారు.రాజకీయాల్లో అతి చిన్న వయస్సులోనే పార్లమెంట్ సభ్యుడు గా అవకాశం లభించింది మార్గాని భరత్ కి. ఆయన తండ్రి మార్గని నాగేశ్వర రావు కు బిసి సంఘ నాయకుడిగా రాష్ట్రవ్యాప్త నెట్ వర్క్ వుంది. అయితే కుమారుడి రాజకీయాలకు నాగేశ్వర రావు ఎన్నికల వరకు వెనుక యంత్రాంగం, మంత్రాంగం అంతా నడిపించినా పార్లమెంట్ సభ్యుడు అయ్యాక ఆయన జోక్యం తక్కువే. విద్యావంతుడు కావడం అందరితో కలగొలుపు వంటి అంశాల్లో భరత్ దూసుకుపోతున్నా పాలన వ్యవహారాల్లో అనుభవలేమి వెంటాడుతుంది. వైసిపి పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ గా వున్న నేపథ్యంలో భరత్ నియోజకవర్గంలో షెడ్యూల్ టైట్ గానే నడుస్తుంది. వీలైనంత సమయం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేందుకు యువకుడు కావడంతో ఎంపి హుషారుగానే దూసుకుపోతున్నారు. అయినప్పటికీ ఆయన సైతం అధికారయంత్రాంగంపై ఇంకా గ్రిప్ సాధించలేదన్నది టాక్. అయితే యువ రాజకీయ నేతలు మాత్రం ప్రజలకు ఎదో మంచి చేయాలనే ఆలోచనతో సాగడం తో రాబోయే రోజుల్లో అనుభవాన్ని వారే అందిపుచ్చుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా.వీరి ముగ్గురిలో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే మాత్రం అధికార గణం హడలిపోతుంది. కీలకమైన ఫైళ్ళు ఆయన ఇంటికే నడిచి వచ్చే అనుభవం ఆయన సొంతం. ఆరు సార్లు ఎమ్యెల్యేగా, ఆరునెలలు మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా గోరంట్లకు వున్న అనుభవం అపారం. దాంతో ముగ్గురు యువ నేత లకు ఆయన పార్టీ వేరు అయినా మార్గదర్శకులు గా నిలుస్తున్నారు. అయితే గోరంట్ల ఆదిరెడ్డి ఒకే పార్టీలో వున్నా సఖ్యత లేకపోవడంతో వైసిపి యువనేతలకు వీలైనప్పుడల్లా ఒకే వేదికలపై కలిసినప్పుడు తన స్పీచ్ ల ద్వారా క్లాస్ లు ఇస్తుండటం ఆకట్టుకుంటుంది.