ఆర్థిక పరిస్థితితో బుగ్గన సతమతం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్థిక పరిస్థితితో బుగ్గన సతమతం

కర్నూలు, అక్టోబరు 23, (way2newstv.com)
మంత్రులు అంద‌రూ ఒకే విధంగా ఉండ‌రు! అంటున్నారు జ‌గ‌న్ కేబినెట్‌లోని మంత్రుల శైలిని గ‌మ‌నిస్తు న్న కొంద‌రు సీనియ‌ర్ అధికారులు. ప్రభుత్వ దూకుడుతో ఒక కీల‌క మంత్రి త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నార‌ని గుస‌గుస‌లాడుతున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో ఇప్పటికిప్పుడు న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేయ‌డం క‌న్నా .. కొన్నాళ్లపాటు వాయిదా వేయాల‌ని ఆయ‌న సూచిస్తున్నార‌ట‌. అయితే, అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కూడా తాను ఎన్నిక‌ల‌కు ముందు ప్రజ‌లకు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తాన‌ని వాగ్దానం చేశాన‌ని, ఈ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని సీఎం జ‌గ‌న్ ఖ‌రాఖండీగా చెబుతుండ‌డం స‌ద‌రు మంత్రి ఏం చేయాలో అర్ధం కాక త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌.ఇంత‌కు ఆ మంత్రి ఎవ‌రో కాదు ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్‌రెడ్డి. ఓ వైపు జ‌గ‌న్ ఎక్కడా వెన‌క్కు త‌గ్గడం లేదు. 
ఆర్థిక పరిస్థితితో బుగ్గన సతమతం

నిజానికి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఇబ్బందుల్లో ఉన్న విష‌యాన్ని ఎవ‌రూ కాద‌నేది లేదు. గ‌తం ఐదేళ్ల కాలంలో చివ‌రి మూడు నెల‌ల స‌మ‌యంలో చంద్రబాబు రు. 43 వేల కోట్ల అప్పు చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్రజ‌ల‌కు ప‌సుపు-కుంకుమ‌, అన్నదాత సుఖీభ‌వ, వివిధ కార్పొరేష‌న్లకు న‌గ‌దు పంపిణీ వంటి అంశాల‌ను తెర‌మీదికి తెచ్చారు. వీటిని అమ‌లు చేసేందుకు నిధులు ఇష్టారాజ్యంగా ఖ‌ర్చు పెట్టారు. ఇక‌, ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌నే ఉద్దేశంతో మీడియాను కూడా త‌న‌దైన శైలిలో మేనేజ్ చేశారు. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల‌కు కోట్ల రూపాయ‌ల్లో యాడ్‌లు ఇచ్చారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.ఇక‌, హ్యాపీ నెస్ట్‌. అంటూ అమ‌రావ‌తిలో ఇళ్లు నిర్మించి ఇస్తానంటూ సేకరించిన సొమ్మును కూడా ఖ‌ర్చు చేశారు. ఇప్పుడు ఇళ్ల కోసం పెట్టుబ‌డులు పెట్టిన వారు సీఆర్డీఏపై ఒత్తిడి తెస్తున్నారు. అదే స‌మ‌యంలో గ‌త ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బోలెడు సొమ్మును బ‌కాయి ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్తాయిలో ఆర్థిక భారం ప‌డింది. ఈ క్రమంలో కీల‌క మైన ఆర్థిక శాఖ‌కు మంత్రిగా ఉన్న రాజేంద్రనాథ్‌రెడ్డి న‌వ‌ర‌త్నాలు స‌హా సంక్షేమంపై చేసే ఖ‌ర్చును త‌గ్గించుకోవాల‌ని జ‌గ‌న్ సూచించార‌ని, అయితే, దీనికి జ‌గ‌న్ స‌సేమిరా అన‌డంతో స‌ద‌రు మంత్రి ఒకింత అస‌హ‌నంతో ఉన్నార‌ని అంటున్నారు.మ‌రి ఈ ప‌ర్యవ‌సానం ఎటు దారితీస్తుందో చూడాలి. కొస‌మెరుపు ఏంటంటే. తాజాగా జ‌రిగిన కేబినెట్ మీటింగ్‌లో నియోజ‌వ‌క‌ర్గానికి కోటి రూపాయ‌ల నిధులు ఇవ్వడానికి జ‌గ‌న్ ప‌చ్చజెండా ఊపారు. అయితే, ఆ వెంట‌నే కలుగ జేసుకున్న స‌ద‌రు మంత్రి.. ఇప్పటికిప్పుడు ఇంత భారీ మొత్తం నిధులురు. 175 కోట్లు ఇచ్చేది లేద‌ని గ‌డువు పెట్టుకోవాల‌ని సూచించార‌ట., సో జ‌గ‌న్ దూకుడుతో బుగ్గన‌ బాధ‌లు ఇలా ఉన్నాయ‌ని అంటున్నారు అధికారులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనూ అప్పటి ఆర్థికమంత్రి రోశయ్య ఇదే తరహాలో ఖర్చుకు అభ్యంతరం చెప్పిన విషయాన్ని కొందరు గుర్తు చేసుకుంటున్నారు.