తార్నాక నుంచి నాగోల్ మెట్రో వరకు సైన్స్ కారిడార్ ఏర్పాటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తార్నాక నుంచి నాగోల్ మెట్రో వరకు సైన్స్ కారిడార్ ఏర్పాటు

హైదరాబాద్,  అక్టోబర్ 25 (way2newstv.com):
వచ్చే నెల 5 వ తేదీ నుంచి కోలకత్తా లో జరగనున్న అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా తార్నాక నుంచి నాగోల్ మెట్రో కారిడార్ వరకు సైన్స్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సి.డి.ఎఫ్.డి డైరెక్టర్ దేబశిష్ మిత్రా తెలిపారు.  హైదరాబాద్ లోని డి ఎన్ ఏ  ఫింగర్ ప్రింటింగ్  డయాగ్నస్టిక్స్ కేంద్రం (సి.డి.ఎఫ్.డి) ఈ రోజు ఓపెన్ హౌస్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా సి.డి.ఎఫ్.డి డైరెక్టర్ దేబశిష్ మిత్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సి.డి.ఎఫ్.డి ఈ ఫెస్టివల్ లో పెద్దెత్తున పాలు పంచుకుంటున్నట్లు చెప్పారు. 
తార్నాక నుంచి నాగోల్ మెట్రో వరకు సైన్స్ కారిడార్ ఏర్పాటు

డి ఎన్ ఏ ఫింగర్ ప్రింటింగ్ లో సి.డి.ఎఫ్.డి  ప్రస్తుతం 'తర్వాతి తరం' టెక్నాలజీ ద్వారా మానవ జీనోమ్ విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కొత్త పరిజ్ణానాన్ని ఉపయోగించి జీనోమ్ విశ్లేషణ వల్ల జన్యు సంబంధిత వ్యాధుల విశ్లేషణ వేగంగా జరుగుతోందని, దాని వల్ల వ్యాధుల గుర్తింపు త్వరగా, చౌకగా జరుగుతోందని చెప్పారు. ఓపెన హౌస్ సందర్భంగా, విద్యా సంస్ధల నుంచి విద్యార్ధులు పెద్ద సంఖ్యలో సి.డి.ఎఫ్.డి లాబొరేటరీలను సందర్శిస్తున్నారని చెప్పారు.