దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకంపై సిఎస్ సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకంపై సిఎస్ సమీక్ష

అమరావతి,  అక్టోబరు 3, (way2newstv.com)
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లోడును మెరుగు పర్చడం, లోఓల్టేజి సమస్యను అధికమించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకం కిందచేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలో దీన్ దయాల్ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకంపై రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో మెరుగుదలకుఏఏ ప్రాజెక్టుల కింద ఎంత మేరకు పెట్టుబడులు పెడుతున్నాము 
దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకంపై సిఎస్ సమీక్ష

వాటి ద్వారా ఎంత మేరకు ఫలితాలు వస్తున్నాయనే దానిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాజెక్టులను నిర్ణీత గడువుప్రకారం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మంచి ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పలానా ప్రాజెక్టు పూర్తయిన పిదప విద్యుత్ సరఫరామెరుగుపడుతుందని వినియోగదారులు స్టెబిలెజర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా హామీ ఇచ్చే రీతిలో వివిధ విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిఎస్ స్పష్టంచేశారు.అదే విధంగా నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి పూర్తి భరోసాను ఇచ్చేవిధంగా విద్యుత్ శాఖఅధికారులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు. అంతేగాక కాస్ట్ బెనిఫిట్ రేషియోను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏప్రాజెక్టు చేపట్టడం ద్వారాఎంతవరకూ ప్రయోజనం కలుగుతుందీ పూర్తిగా అవగాహన కలిగించాలని సిఎస్ సుబ్రహ్మణ్యం ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన పధకం అమలుకు సంబంధించి రూ. 521.54 కోట్లు మంజూరు కాగా గ్రామీణ విద్యుదీకరణ, నాన్ ఆర్ఇ కాంపొనెంట్ కింద విద్యుత్ ఉప కేంద్రాలు, డిటిఆర్ మీటర్లు,హెచ్విడిఎస్ తదితర పనులకు ఇప్పటికే 404 కోట్లు రూ.లు ఖర్చు చేయగా మిగతా 117 కోట్ల 54 లక్షల రూ.లు ఖర్చు చేసేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ పథకం కిందఎపిఎస్పిడిసిఎల్ పరిధి కింద 8జిల్లాల్లో అదనంగా 33/11 కెవి సామర్ధ్యంతో కూడిన 66 ఉప విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు ద్వారా విద్యుత్ లోడ్ సామర్థ్యాన్ని పెంచడం, లో ఓల్టేజిసమస్యను తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నారు.ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్సు రాజ బాపయ్య, ఎపి ఎస్పిడిసిఎల్ డైరెక్టర్ టెక్నికల్టి.వనజ, ఆర్ఇసి ప్రతినిధి వెంకటేశన్, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి డా.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.