రక్షణశాఖ భూములు అప్పగించండి

రాజ్ నాధ్  కు కేటీఆర్ వినతి
న్యూ ఢిల్లీ అక్టోబర్ 30  (way2newstv.com)
కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాధ్  సింగ్  మంత్రి కేటీఆర్ బుధవారం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్ లో రహదారుల విస్తరణ, స్కైవేల ఏర్పాటుకు... రక్షణశాఖ భూములు అప్పగించాలని కోరారు. 
రక్షణశాఖ భూములు అప్పగించండి

హైదరాబాద్-నాగ్ పూర్, హైదరాబాద్-రామగుండం రహదారులపై... స్కైవేలు ఏర్పాటు చేయనున్నట్లు రాజ్ నాధ్  కు కేటీఆర్ తెలిపారు. అందుకోసం రక్షణశాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు.
Previous Post Next Post