రైతు బాగుండాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతు బాగుండాలి

కర్నూలు, అక్టోబర్ 16, (way2newstv.com):
రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ఉద్ఘాటించారు. బుధవారం జిల్లా పరిషత్  సభా భవనంలో బరోడా బ్యాంకు ఆధ్వర్యంలో రైతు పక్షోత్సవ సంబరాలు నిర్వహించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే రైతు అభివృద్ధి చెందాలని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని  అన్నరు.. రైతుల సంక్షేమం కోసం  బ్యాంక్ ఆఫ్ బరోడా అక్టోబర్ 1నుండి 16వ తేది వరకు రైతు పక్షోత్సవ సంబరాలు జరపడం చాలా సంతోషంగా  వుందన్నారు.  ప్రపంచ ఆహార దినోత్సవంను  పురస్కరించుకుని  బుదవారం బరోగా ప్రపచ ఆహార దినోత్సవ వేడుకల్లో భాగంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. 
రైతు బాగుండాలి

మారుమూల ప్రాంతాలలో బ్యాంకు సేవలు, లావాదేవీలు, రుణాలు వాటిపై అవగాహన కల్పించి ప్రతి ఒక్క రైతు  బ్యాంకు ఖాతా తెరిచేలా బ్యాంక్ అధికారులు కృషి చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  రైతన్నల కోసం వై ఎస్ ఆర్ రైతు భరోసా పెట్టుబడి సహాయం, ఒక్క రూపాయకే పంట భీమా పథకం అందిస్తోందని అన్నారు. మహిళలు ఆర్ధికంగా ఎదగాలంటే ప్రతి ఒక్క మహిళ పొదుపు సంఘాల్లో చేరి తమ నగదు బ్యాంక్  ఖాతాలో నిల్వ ఉంచుకోవాలన్నారు.  మన రాష్ట్రం లోనే మహిళా పొదుపు సంఘాలు ఉన్నాయని మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయన్నారు. రైతులకు సకాలంటో బ్యాంక్ పంట రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు బాగా సహకరించడం చాలా బాగుందన్నారు. బ్యాంకు సేవలను రైతులు, మహళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  అనంతరం మహిళా పొదుపు సంఘాలకు బ్యాంకు అధికారులు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ చేతుల మీదగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్, డిప్యూటి మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.