హోమ్ మంత్రి, ప్రధానితో తమిళసై భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హోమ్ మంత్రి, ప్రధానితో తమిళసై భేటీ

హైద్రాబాద్, అక్టోబరు 15, (way2newstv.com)
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం ఢిల్లీ వెళ్తున్న ఆమె.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం హోం మంత్రి అమిత్ షాతో సమావేశంమయ్యారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. ఆర్టీసీ సమ్మె గురించి కేంద్రం గవర్నర్‌ను నివేదిక కోరారు అనేక విషయాలు చర్చకు రానున్నప్పటికీ.. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరే చర్చకు వచ్చే అవకాశం ఉంది.మరోవైపు తెలంగాణ సర్కారు పోలీసులకు సెలవులను రద్దు చేసింది. 
హోమ్ మంత్రి, ప్రధానితో తమిళసై భేటీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం.. పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా.. పోలీసుల సెలవులు రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బస్‌ డిపో, బస్టాండుతో పాటు ప్రధాన ప్రాంతాల్లో పోలీస్‌ బలగాలు మోహరించి ఉన్నాయి. అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌ నేపథ్యంలో సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌‌పై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరపగా.. మంగళవారం మరోసారి న్యాయస్థానంలో విచారణకు రానుంది. సమ్మె గురించి పూర్తి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమంతట తామే ఉద్యోగాలను పోగొట్టుకున్నారన్న సీఎం కేసీఆర్ సమ్మె విషయంలో కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తాను సిద్ధమని సీనియర్ నేత కేశవ రావు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ కూడా కేశవ రావు మధ్యవర్తిత్వాన్ని ఆహ్వానించింది.