త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు

ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ కృష్ణబాబు వెల్లడి
తిరుపతి అక్టోబరు 15, (way2newstv.com)
రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, అమరావతి, తిరుపతి, కాకినాడ నగరాల్లో త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. 
త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు

తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన ఆర్టీసీ గ్యారేజీని పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ కేంద్రం సహకారంతో 325 ఎలక్ట్రిక్ బస్సులు(రాయితీతో) రానున్నాయన్నారు. తిరుపతి- తిరుమల మధ్య 150 ఎలక్ట్రిక్ బస్సులను 3 నెలల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎలక్ట్రిక్ బస్సుల ప్రక్రియను మరింత వేగవంతం చేసినట్టు తెలిపారు. తిరుమలలో చార్జింగ్ పాయింట్ పెట్టుకోవడానికి టీటీడీ స్థలాన్ని కేటాయించాలని ఈవో, చైర్మన్ను కోరినట్టు చెప్పారు