జూపూడిలో వైసీపీ తత్వం అర్ధమైనట్టుందే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూపూడిలో వైసీపీ తత్వం అర్ధమైనట్టుందే

ఏలూరు, అక్టోబరు 25, (way2newstv.com)
ఎస్ జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా మొన్నటి దాకా ఉన్న జూపూడి ప్రభాకర్ రావు అధికారంలోకి రాగానే వైసీపీలో చేరిపోయారు. జూపూడి ప్రభాకర్ రావుకు జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆత్మీయంగా కండువా కప్పేశారు. కండువా కప్పుకున్న తర్వాత జూపూడి ప్రభాకర్ రావు జగన్ వీరలెవెల్లో పొగిడేశారు. మరో ముఖ్యనేత విజయసాయిరెడ్డిని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత జూపూడి ప్రభాకర్ రావు మౌనంగానే ఉంటున్నారు. ఆయన చేరికతో పార్టీలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ఇది జగన్ సయితం ఊహించలేదు.జూపూడి ప్రభాకర్ రావు వైసీపీలో చేరిన వార్తలను, ఫొటోలను చూడగానే వైసీపీ సోషల్ మీడియాలో సయితం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. 
జూపూడిలో వైసీపీ తత్వం అర్ధమైనట్టుందే

జూపూడి ప్రభాకర్ రావును చేర్చుకుని జగన్ తప్పు చేశారంటూ అనేక మంది వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానాలు చేసిన వారంతా జగన్ కు వీర అభిమానులే కావడం విశేషం. తోట త్రిమూర్తులును చేర్చుకున్నప్పుడు రాని వ్యతిరేకత జూపూడి ప్రభాకర్ రావుకు కండువా కప్పినప్పుడే ఎందుకు వ్యతిరేకత వచ్చిందన్న కామెంట్స్ వైసీపీ సీనియర్ నేతల నుంచి విన్పించాయి. పనిలో పనిగా విజయసాయిరెడ్డిని కొందరు కార్నర్ చేశారు.అయితే ఇదంతా గమనించిన జగన్ జూపూడి ప్రభాకర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అగ్రనేతలకు సూచించినట్లు తెలిసింది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 మంది అధికార ప్రతినిధుల జాబితా విడుదల చేసింది. ఇందులో జూపూడి ప్రభాకర్ రావు పేరు లేదు. పార్టీలో చేరగానే తనకు కనీసం అధికార ప్రతినిధి హోదా అయినా వస్తుందని జూపూడి ప్రభాకర్ రావు ఆశించినట్లు తెలుస్తోంది. అయితే జూపూడి ప్రభాకర్ పేరును తొలుత తేర్చి తర్వాత జగన్ సలహాతోనే దానిని తొలిగించినట్లు చెబుతున్నారు.ఎవరిని చేర్చుకున్నా పార్టీలో రాని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వచ్చిందని జగన్ సయితం ఆరాతీశారట. మాల మహానాడుగా ఎదిగి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మెలిగిన జూపూడి ప్రభాకర్ ను పార్టీలోకి చేర్చుకుంది ఆయన నుంచి పెద్దగా ఆశించి కాదు. టీడీపీని బలహీన పర్చడంలో భాగంగానే చేర్చుకున్నారు. అయితే క్యాడర్, నేతల నుంచి ఇంత వ్యతిరేకత రావడంతో సమీప భవిష్యత్తులో జూపూడి ప్రభాకర్ రావుకు ఎలాంటి పదవి పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని దక్కే అవకాశం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద జూపూడి ప్రభాకర్ రావుకు ఇప్పుడు వైసీపీలో తన సీన్ అర్థమయినట్లుంది