గన్నవరంపై లెక్కలు షురూ అయ్యాయే.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గన్నవరంపై లెక్కలు షురూ అయ్యాయే..

విజయవాడచ అక్టోబర్ 30, (way2newstv.com)
గన్నవరం…ఇపుడు ఏపీలో హాట్ టాపిక్. పసుపు పారాణి ఇంకా ఆరకమునుపే తుడిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ పొలిటికల్ సీన్ లో కనిపిస్తున్నారు. ఎన్నికలు జరిగి నిండా ఆరు నెలలు కాలేదు, అపుడే రాజీనామా అంటున్నారాయన. కారణాలు ఏవైనా ఇంత తొందరగా ఎన్నికలు రావడం అంటే విడ్డూరమే. సరే ఏపీలో 151 సీట్లతో వైసీపీ పూర్తి కంఫర్ట్ గా ఉంది. ఆ పార్టీకి ఈ రాజీనామా వల్ల వచ్చేది ఏమైనా ఉండాలి తప్ప పోయేది లేదు. కేవలం 23 సీట్లలో మాత్రమే గెలిచిన టీడీపీ సంచికే చిల్లు పడుతుంది. అందువల్ల వల్లభనేని వంశీ రాజీనామాను వెనక్కు తీసుకుంటే మేలు. అలా కాకపోతే మాత్రం ఉప ఎన్నికలు దూసుకువచ్చేస్తాయి. అలా కనుక వస్తే అది ఏపీ రాజకీయాల్లో అన్ని పార్టీల బలాబలాలను తేల్చేస్తుంది. 
గన్నవరంపై లెక్కలు షురూ అయ్యాయే..

ముఖ్యంగా జగన్ ని ఎన్నుకుని జనం తప్పు చేశామని బాధ పడుతున్నారని అంటున్న చంద్రబాబు మాటకు ఉన్న విలువ ఏంటో తెలియచెబుతుంది. మరో వైపు అదృష్టవశాత్తు వైసీపీ గెలిచిందని సెటైర్లు వేస్తున్న జనసేనకు కూడా వాస్తవం ఏంటో చూపిస్తుంది. జగన్ ముప్పయేళ్ళ సీఎం అని ధీమా పడుతున్న అధికార పార్టీకి అసలైన లెక్కలు చెబుతుంది.గన్నవరం ఉప ఎన్నిక కనుక జరిగితే మాత్రం జనసేనానికి బంగారు లాంటి అవకాశం అంటున్నారు. ఎందుకంటే ఏ పదవి లేకుండా ఉన్న పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి వస్తే ఆయన పార్టీ మళ్ళీ సేఫ్ పొజిషన్లోకి వచ్చేస్తుందని అంటున్నారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలు అయి పరాభవంతో ఉన్న పవన్ కి గన్నవరం రూపంలో వరమే అందినట్లు అంటున్నారు. పవన్ తన పార్టీకి జనంలో బలం ఉందని పదే పదే చెప్పుకుంటారు. పైగా వైసీపీ సర్కార్ పూర్తిగా జన విశ్వాసం కోల్పోయిందని కూడా వాదిస్తుంటారు. దాన్ని నిరూపించుకోవాలంటే తప్పకుండా పవన్ పోటీ చేయాల్సివుంటుంది. అంతే కాదు, టీడీపీతో ఎటువంటి లాలూచీ లేదని చెప్పుకోవడానికైనా ఈ పోటీ పవన్ కి అవసరం. మరి పవన్ గన్నవరం విషయంలో ఆలోచన చేస్తారా..చూడాలి.ఇక మంగళగిరి తిరునాళ్ళకు పోయి సొమ్ములు మొత్తం పోగొట్టుకున్న అమాయక ముత్తయిదువ మాదిరిగా వైసీపీ చేతిలో చినబాబు దారుణమైన పరాజయాన్ని పొందారు. ఆ అవమానం అలా ఉండగానే ఇపుడు గన్నవరం ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా టీడీపీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలో సీటు ఇది. టీడీపీ సామాజికవర్గం అధిక సంఖ్యలో ఉన్న సీటు. వైసీపీ మీద జనంలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని నిరూపించడానికి, తాను అసెంబ్లీలో అడుగుపెట్టి పాత పరాభవం రూపుమాపుకోవడానికి లోకేష్ కి గన్నవరం నిజంగా అనుకోని వరమే అవుతుందని అంటున్నారు. వంశీ ఎపిసోడ్ టీ కప్పులో తుపాను గా సమసిపోకపోతే వైసీపీతో సహా అన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా కూడా ఇదే సీటు మారిపోయే ప్రమాదం ఉంది. మరి గన్నవరం తనకు శాపం అంటూ దూరంగా జరిగిన వంశీ ఒక వైపు ఉంటే ఇదే సీటు ఎవరికి వరం అవుతుందో చూడాల్సివుంది.ముందు చూపా... సేఫ్ జోనా..టీడీపీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ వ్యూహం ఏంటి? ఆయ‌న ఊరికేనే రాజీనామా చేసేశారా? ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కి ఐదు మాసాలు కూడా గ‌డ‌వ‌క ముందుగానే రాజీనామా చేయ‌డం వెనుక వ్యూహం ఏంటి? అదే స‌మ‌యంలో టీడీపీ త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని చెబుతూనే.. న‌ర్మగ‌ర్భంగా పార్టీ అధినేత చంద్రబాబుకు కృత‌జ్ఞత‌లు చెప్పడం వెనుక ఏదైనా స్ట్రాట‌జీ ఉందా? ఇప్పుడు మేధావుల‌ను సైతం తొలిచేస్తున్న ప్రశ్నలివి! నిజానికి రాజ‌కీయాల్లో ఉన్నవారు చిన్నవారైనా.. పెద్దవారైనా వారికంటూ ప్రత్యేకంగా వ్యూహాలేవీ లేకుండా ఉండే ప‌రిస్థితి ఉండ‌దు.వల్లభనేని వంశీ గురించి దృష్టి పెట్టినా.. ఆయ‌న కూడా వ్యూహం లేకుండా ఉత్తుత్తినే రాజీనామాలు చేయ‌డం, కేసుల‌కు భ‌య‌ప‌డి పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం ఉందంటే అంత తేలిక‌గా న‌మ్మే ప‌రిస్థితి లేదు. అదే స‌మ‌యంలో వల్లభనేని వంశీ బాబును కానీ, పార్టీని కానీ ఒక్క మాటంటే ఒట్టు. ఈ మొత్తం ప‌రిశీలిస్తే.. చాలా వ్యూహాత్మకంగానే వల్లభనేని వంశీ అడుగులు వేసిన‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తోంది. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ ఆయ‌న వైసీపీలోని కొంద‌రు నేత‌ల‌తో స‌ఖ్యత‌గా మెలిగారు. వారితో త‌న స్నేహాన్ని కొన‌సాగించారు. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, గుడివాడ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి కూడా అయిన కొడాలి నానితోను, పేర్ని వెంక‌ట్రామ‌య్య మ‌చిలీ ప‌ట్నం నుంచి ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన నానితోనూ ఆయ‌న స్నేహం కొన‌సాగించారు.2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లో పాద‌యాత్ర చేసిన‌ స‌మ‌యంలో జ‌గ‌న్ గ‌న్నవ‌రంలో ప‌ర్యటించిన స‌మ‌యంలోను ఆయ‌న‌తో క‌లిసి ఫొటోల‌కు ఫోజులిచ్చారు. అది పెద్ద విమ‌ర్శల‌కు కూడా దారి తీసింది. ఇలా టీడీపీలో ఉన్న స‌మ‌యంలోనే వల్లభనేని వంశీ వైసీపీ నేత‌ల‌తో స్నేహం చేశారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఒక్క దేవినేని ఉమాతో త‌ప్ప ఆయ‌న విభేదించిన నాయ‌కులు పెద్దగా ఎవ‌రూ లేరు. పైగా చంద్రబాబును గౌర‌వించే నాయ‌కుల్లోను వల్లభనేని వంశీ ముందున్నారు. ఇప్పుడు రాజీనామా చేసిన త‌ర్వాత కూడా ఆయ‌నను ఒక్కమాట అన‌లేదు. పైగా త‌న‌కు రెండుసార్లు టికెట్ ఇచ్చినందుకు కృత‌జ్ఞత‌లు చెప్పారు. స‌రే! రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ఇప్పుడు చెప్పినా.. రెండు నెల్లలోనే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయం.అయితే, వల్లభనేని వంశీ ఇప్పుడు వేసిన అడుగులు మాత్రం వ్యూహాత్మకంగానే ఉన్నాయి. త‌న‌ను తాను కాపాడుకునే క్రమంలో ఇటు వైసీపీతోను, అటు టీడీపీతోనూ ఆయ‌న చెలిమి చేయాల‌నే భావిస్తున్నట్టు క‌నిపిస్తోంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది .. క‌నుక ఈ పార్టీలో చేరినా, 2024లో ఈ పార్టీ అధికారం కోల్పోయి టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా త‌న ప్లేస్‌ను పోగొట్టుకోకుండా వల్లభనేని వంశీ ఇప్పటి నుంచే జాగ్రత్త ప‌డ్డార‌ని, అందుకే అధినేత చంద్రబాబుపై ఇంత విన‌యం చూపిస్తున్నార‌ని అంటున్నారు. సో.. మొత్తానికి రాజ‌కీయాల్లో ఎలా ఉండాలో ఏం చేయాలో అలానే ఉంటూ.. అదే చేస్తున్నార‌ని వల్లభనేని వంశీ గురించి తెలిసిన వారు అంటున్నారు.