మోడీతో అభిజిత్ బెనర్జీ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మోడీతో అభిజిత్ బెనర్జీ భేటీ

న్యూఢిల్లీ, అక్టోబరు 22   (way2newstv.com)
నోబెల్ పురస్కార విజేత ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మోదీ.. అనేక అంశాల గురించి ఆరోగ్యకరమైన, విస్తృతమైన చర్చ జరిపామని తెలిపారు. బెనర్జీ భవిష్యత్తులో తలపెట్టే పనులు విజయవంతం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆయన సాధించిన విజయాల పట్ల దేశం గర్విస్తోందన్నారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బెనర్జీ.. ప్రధానితో భేటీ కావడం గర్వంగా ఉందన్నారు. మోదీ తనకు సమయం కేటాయించడం ఆనందం కలిగించిందన్నారు.భారతదేశం గురించి తన ఆలోచన విధానాన్ని ప్రధాని మోదీ వివరించారని, తన పాలన గురించి తెలిపారని బెనర్జీ వెల్లడించారు. 
మోడీతో అభిజిత్ బెనర్జీ భేటీ

ఉద్యోగ వ్యవస్థ మరింత బాధ్యతాయుతంగా ఉండటం కోసం ప్రక్షాళన చేయడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారని బెనర్జీ తెలిపారు. దేశానికి ఇదెంతో ముఖ్యమన్నారు.పేదరిక నిర్మూలన కోసం చేసిన కృషికిగానూ 2019లో ఆర్థిక శాస్త్రంలో బెనర్జీకి నోబెల్ పురస్కారం దక్కింది. భారత్‌లో జన్మించిన ఆయన అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయం రంగం ప్రభావితమైందని.. పంటలకు సరైన ధరలు రావడం లేదని బెనర్జీ వ్యాఖ్యానించారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల వృద్ధిరేటు పెరగదన్న ఆయన.. ప్రత్యక్ష పన్నులను అదుపు చేయడం వల్ల ఫలితం ఉంటుందన్నారు. బెనర్జీ వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తీసుకొస్తామని చెప్పిన న్యాయ్ పథకంపై బెనర్జీ ప్రశంసలు గుప్పించారు. కానీ ఆయన ఆలోచనను భారతీయులంతా తిరస్కరించారని మంత్రి వ్యాఖ్యానించారు.