అర్హులందరికి సంక్షేమ పథకాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అర్హులందరికి సంక్షేమ పథకాలు

విజయవాడ. అక్టోబర్ 18  (way2newstv.com)
కాపులకు ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ప్రతి ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కేటాయిస్తున్నారు.చంద్రబాబు అధికారంలో ఉండగా కాపులను మోసం చేశారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజు అన్నారు.  శుక్రవారం రెండవరోజు కాపు విదేశీ విద్యా దీవెన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో అయన మీడియాతో మాట్లాడారు. కాపుల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు.పవన్ కళ్యాణ్ పోటీచేసిన ఉభయ గోదావరి జిల్లాలో కాపులు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు కాపులకు ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని అయన అన్నారు. 
అర్హులందరికి సంక్షేమ పథకాలు

కేవలం ఐదేళ్లలో 1700 కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2000 కోట్లు కాపులకు కేటాయించారు. కాపు విదేశీ విద్య దీవెన పథకం కు100 కోట్లు కేటాయించారు.గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు  అందుతున్నాయని అన్నారు.కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి.గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకే లోన్లు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో కాపులకు 1700 కోట్ల రూపాయల ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తొలి యేడాదిలోనే 2000 కోట్లు ఇచ్చారు తండ్రి బాటలోనే సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. ఈ ఏడాది కాపు విదేశీ విద్య దీవెన ద్వారా 1000 మందిని విదేశాలకు పంపుతున్నాము. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళారులకు స్థానం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అన్ని ప్రజలు వద్దకే చేరుతున్నాయని మంత్రి అన్నారు.