హైదరాబాద్ అక్టోబరు 21, (way2newstv.com)
ని బస్సులకు ప్రయాణీకులు పడిగాపులు గాస్తున్నారు. దసరా సెలవులకు ప్రభుత్వం అదనంగా ప్రకటించిన సెలవుల అనంతరం మళ్ళీ సోమవారం ప్రారంభం అయిన విద్యాసంస్థలకు చేరుకోవడానికి విద్యార్థినీ విద్యార్థులు, ఉద్యోగరీత్యా కార్యాలయాలకు చేరుకోవాల్సిన ఉద్యోగులు హైదరాబాద్ లో కానరాని ఆర్ టీ సి బస్సుల కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు.
రాని బస్సులకు ప్రయాణీకుల పడిగాపులు
సోమవారంనాడు ఉదయం 9.00 గంటలకుహైదరాబాద్ లోని ప్రదాన బస్ స్టాపుల్లో రాని బస్సులతో ప్రయాణికులు ఎదురుచూసారు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేటందుకు ఆర్టీసీ సిటీ బస్సులు ఎక్కేందుకు ప్రయాణీకులు పడరాని పాట్లు పడ్డారు. . ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రకటించినా పరిస్థితి మారలేదు. ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. పడిగాపులు కాస్తున్నారు.