లాభాలతో స్టాక్ మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లాభాలతో స్టాక్ మార్కెట్లు

ముంబై, అక్టోబరు 23 (way2newstv.com)
దేశీయ స్టాక్‌మార్కెట్లు  స్వల్ప లాభాలతో ముగిసాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు మధ్యకొనసాగిన కీలక సూచీలు  లాభాలతోనే ముగిసాయి. సెన్సెక్స్‌ 95 పాయింట్ల లాభంతో 39058 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 11604 వద్ద ముగిసాయి.  ఒక దశలో 250 పాయింట్లు ఎగిసాయి. చివరికి సెన్సెక్స్‌ 39 వేల ఎగువన, నిఫ్టీ 11604 వద్ద ముగిసాయి. 
లాభాలతో స్టాక్ మార్కెట్లు

ఆరు రోజుల వరుస ర్యాలీకి సోమవారం బ్రేక్‌  వేసిన మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా ఆటో, రియల్టీ రంగాలు నష్టపోగా,  ఐటీ లాభపడింది. అదానీ పోర్ట్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, జీ, వేదాంతా, గ్రాసిం,ఓన్‌జీసీ, రిలయన్స్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు  హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతి సుజుకి, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హీరో మోటో,  టైటన్‌ లాభపడ్డాయి.