హైదరాబాద్ అక్టోబర్ 31 (way2newstv.com)
ప్రముఖ సినీ నటి గీతాంజలి కన్ను మూసారు. గుండెపోటుతో అపోలో ఆసుపతరిలో చికిత్స పొందుతూ ఆమె రాత్రి 11:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కాకినాడలో జన్మించిన గీతాంజలి ..అసలు పేరు మణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన గీతాంజలి.. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు.
సినీయర్ నటి గీతాంజలి మృతి
ఐదేళ్ల ప్రాయంలోనే నృత్యం నేర్చుకున్నారు. సుమారు 400 సినిమాలలో నటించిన గీతాంజలి సీతారామ కల్యాణ్యంలో సీతగా నటించి అందరి మెప్పు పొందారు. ఎన్టిఆర్, ఎఎన్ఆర్, శివాజీ గణేశన్ తదితర ప్రముఖ హీరోలతో కలిసి నటించారు. హాస్యనటిగా పలు చిత్రాల్లో నటించారు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల రోజుల్లో గీతాంజలి పద్మనాభం జంట ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.