కామారెడ్డి అక్టోబరు 29 (way2newstv.com)
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అదే సమయానికి కళ్యాణి ప్రాజెక్టు గేట్లు మొరాయించాయి. ఈ కారణంగా గేట్లు ఎత్తకపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. రహదారిపై వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఎల్లారెడ్డి - తిమ్మారెడ్డిల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి.
అకాల వర్షం…నీట మునిగిన పోలాలు
కళ్యాణి ప్రాజెక్టు ఎఇ అందుబాటులో లేకపోవడంతో నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నిజాంసాగర్ డిప్యూటీ ఇఇ దత్తాద్రి కళ్యాణి ప్రాజెక్టు వద్దకు చేరుకొని గేట్లు ఎత్తే ప్రయత్నం చేసారు.