జగన్ కోసం జైలుకు పోతా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ కోసం జైలుకు పోతా

హైద్రాబాద్, అక్టోబరు 18 (way2newstv.com)
సోషల్ మీడియాలో సెన్సెషనల్ కామెంట్స్ చేసే నటి శ్రీరెడ్డి ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఫోకస్ పెట్టింది. ఇటీవలే ఫేస్‌బుక్ ద్వారా జగన్‌కు కొన్ని సలహాలిచ్చిన ఆమె.. తాజాగా ఏపీ సీఎంకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. జగన్‌కు ఎవరైనా అడ్డొస్తే మర్డర్ చేసి జైలుకుపోతా.. ఆయన సిన్సియర్‌గా పని చేస్తున్నారు.. ఆయన పని ఆయన్ను చేయనీయండంటూ ఆమె వ్యాఖ్యానించారు. జగన్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే.. కోపం పట్టలేకపోతున్నానంటూ ఆమె ఊగిపోయారు. జగన్ ఆర్డర్ వేస్తే వాళ్ల కింద బాంబు వేస్తానంటూ కామెంట్ చేశారు.మీడియాను ప్రభుత్వం నియంత్రించడం తప్పన్న శ్రీరెడ్డి.. మీడియా కూడా తమకు ఇష్టమైన పార్టీ గురించి ఓహో, ఆహో అని రాస్తూ.. వేరే పార్టీ వాళ్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని.. క్రిమినల్స్ అని రాయడం, చిన్నచూపు చూడటం తప్పని శ్రీరెడ్డి సెలవిచ్చారు. 
జగన్ కోసం జైలుకు పోతా

నిష్పక్షపాతంగా వార్తలు రాస్తే న్యూస్ ఛానళ్లు, వార్తా పత్రికలను నడపండి. లేదంటే మీ మనవడికి న్యాపీ ప్యాడ్స్ మార్చుకోండని సలహా ఇచ్చారు.తమిళనాడులో మీడియా ఎప్పుడూ ఒకే వైపు ఉండదన్న శ్రీరెడ్డి.. ప్రజాసమస్యల వైపే మీడియా ఉంటుందన్నారు. తమిళ మీడియా ఏ ఒక్కరి చేతుల్లోనో ఎప్పుడూ లేదన్నారు. ఇక్కడ ఎంతటి శక్తివంతమైన నాయకుడి మీదైనా కార్టున్లు వేయడానికి వెనుకాడరని.. తమిళనాడులోని ఎఫ్ఎం ఛానళ్లు కూడా సమాజ సేవ కోసం పని చేస్తున్నాయంటూ శ్రీరెడ్డి కితాబిచ్చారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడిపోనీయకుండా, కాంగ్రెస్‌ను ఎదిరించి పాలన చేసిన ఒకే ఒక్క మగాడు వైఎస్ అన్న శ్రీరెడ్డి.. దాని ఫలితంగానే ఈ రోజు రాజశేఖర రెడ్డిని కోల్పోయామంటూ.. రాజశేఖరరెడ్డిది హత్య అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. మీరు లేకపోవడంతో ప్రతి కుక్క జగన్ గారిని కరవాలనుకుంటోంది, ఏం చేయాలో అర్థం కావడం లేదని శ్రీరెడ్డి బాధపడ్డారు. రాజశేఖర రెడ్డిని తలుచుకుంటే కన్నీరు ఆగడం లేదన్నారు.నా బంగారు ఆంధ్రాను బలి పశువును చేశారు కదరా? జగన్ గారిని ఎందుకు బాధపెడుతున్నార్రా? అంటూ శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. బీజేపీ గతంలో టీడీపీకి ఏం చేసిందో.. ఇప్పుడు అదే పని జగన్‌తో చేస్తోంది. ఇలాంటి రాజకీయాలతో ఆంధ్రా నానాటికీ బలహీన పడుతోంది. ఇదంతా చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.