ఏలూరులో కంటి వెలుగు ప్రారంభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏలూరులో కంటి వెలుగు ప్రారంభం

ఏలూరు, అక్టోబరు 10, (way2newstv.com)
డా.వైఎస్ఆర్ కంటి వెలుగు తొలి విడత కార్యక్రమం క్రింద జిల్లాలో 5,28,259 మంది ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ఆర్.ముత్యాలరాజు తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కస్తూరిబా మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డా.వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్నిజిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ రాష్ట్రంలో నివారించగలిగిన అంధత్వాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వండా.వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని 6 విడతలుగా రానున్న రెండేళ్ల కాలంలో బృహత్తర స్థాయిలో నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి,కళ్లద్దాలు, శక్లాల ఆపరేషన్లు, నీటికాసులు, మెల్ల, డయాబెటిక్ రెటినోపతి తదితర కంటి సమస్యలకు వైద్య సేవలు ఉచితంగా అందిచడం జరుగుతుందన్నారు. 
ఏలూరులో కంటి వెలుగు ప్రారంభం

కంటివెలుగు తొలి రెండువిడత కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని 70 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు, దృష్టి దోషాల సవరణ ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీనుండి 16వ తేదీ వరకూ జిల్లాలోని 4,417 ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో చదువుతున్న 5,28,259 మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించి దృష్టి లోపాలు గమనించినవిద్యార్థులను గుర్తిస్తున్నామని తెలియజేశారు. దృష్టి దోషాలు కలిగిన విద్యార్థులకు నవంబరు, డిశంబరు నెలల్లో కంటి వైద్య నిపుణులు అవసరమైన వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు,కళ్లజోళ్లు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ఇందుకు జిల్లాలోని 92 పిహెచ్సిలు, 20 ఈ-యూపిహెచ్సిలు, 635 సబ్ సెంటర్ల పరిధిలో ప్రత్యేక శిక్షణ కల్పించిన 4,947 స్క్రీనింగ్ టీములుఏర్పాటు చేయడం జరిగిందని, పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో ఈ నెల 10, 11 తేదీలలో అర్బన్ ప్రాంత పాఠశాలల్లోను, 14,15,16 తేదీల్లో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోను ఈటీములు కంటి పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో చదువుతన్న ప్రతి విద్యార్థి ఈ ఉచిత కంటి స్క్రీనింగ్ సేవలు పొందేలా చూడాలని ఆయనఉపాధ్యాయులను, యాజమాన్యాలను కోరారు. 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 2022 జనవరి 31 వరకూ నిర్వహించే 3 నుండి 6 దశల కంటి వెలుగు కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీస్థాయిలో పెద్దలందరికీ ఉచిత కంటి పరీక్షలు, వైద్య సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కంటి సమస్యలు ఎందుకు వస్తాయి, వాటిని మంచి అలవాట్లు, ఆహారంద్వారా ఏ విధంగా నివారించ వచ్చననే అంశాలపై జిల్లా కలెక్టర్ విద్యార్థినులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించి, వారికి అవగాహన కల్పించారు. టివి, సెల్ఫోన్లను దగ్గరగా చూడ వద్దని, అందువల్ల దృష్టి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే ఎ-విటమిన్ పుష్కలంగా ఉండే క్యారెట్, ఆకుకూరలు, పళ్లు విద్యార్థులు ఆహారంలో తీసుకోవాలనిసూచించారు. మద్యాహ్న భోజన పధకం మోనూలో ఏ విటమిన్ అధికంగా ఉండే పదార్థాలు విధిగా ఉండేలా చూడాలని డిఈఓను కోరారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల అందరూకంటివెలుగు పధకం ఉచిత వైద్య సేవలను తప్పని సరిగా వినియోగించుకోవాలని కోరుతూ, విద్యార్థులు అందరూ హాజరై పరీక్షలు చేయించుకోనేట్లు చూడాలని ఉపాధ్యాయులను కోరారు.సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు విశిష్ట అతిధిగా ప్రసంగిస్తూ, ఇంద్రియాలన్నిటిలో కన్ను అత్యంత ప్రధానమైనదని, లోకాన్ని చూపించేకన్నుల ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని కోరారు. రాష్ట్రంలో నివారించ గల అంధత్వాన్ని తగ్గించి, ఇంటింటా కంటి వెలుగు నింపే బృహత్త కార్యక్రమాన్ని అంతర్జాతీయ దృష్టిదినోత్సవం సందర్భగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు, ప్రజలు ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జాయింట్ కలెక్టర్-2 తేజ్ భరత్ మాట్లాడుతూ దృష్టి దోషాలను ప్రాధమిక దశలో గుర్తించి జాగ్రత్తలు, సవరణలు చేపడితే నేత్ర పరమైన పెద్ద సమస్యలను అరికట్టవచ్చునన్నారు. స్క్రీనింగ్టీమీలు, ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి లోపాలు గుర్తించిన వారి వివరాలను ఏరోజు కారోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కోరారు. డేటాఅప్లోడింగ్లో ఏవిధమైన లోపాలకు తావు లేకుండా తగు జాగ్రత్త పాటించాలన్నారు.కార్యక్రమానికి డిఎంహెచ్ఓ డా.సుబ్రమణ్యశ్వరి అధ్యక్షత వహించగా, డిఈఓ సి.వి.రేణుక, డిసిహెచ్ఎస్ డా.శంకరావు, కంటి వైద్య నిపుణులు డా.ఎ.ఎస్.రాము నేత్ర ఆరోగ్య ఆవశ్యకత,పాటించ వలసిన అంశాలపై విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిభిరంలో విద్యార్థినులకు కంటి పరీక్షల నిర్వహించే ప్రక్రియను జిల్లా కలెక్టర్ప్రారంభించి, స్క్రీనింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు పధకం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.ఎస్.రమణ, మున్సిపల్ కమీషనర్ఒ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.