బాబు స్నేహగీతం వెనుక... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాబు స్నేహగీతం వెనుక...

విజయవాడ, అక్టోబరు 23, (way2newstv.com)
ఇద్దరు శత్రువులను ఒకేసారి ఎదుర్కోవడం కన్నా ఒక్కొక్కరిగా నరుక్కు రావడమే ఇప్పుడు ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. ఎపి బిజెపి ది ఇప్పుడు ఒక్కటే లక్ష్యం. టిడిపి ని సమూలంగా లేకుండా చేస్తేనే వైసిపి కి ప్రత్యామ్నాయ పార్టీ తమదే అని ప్రజలు గుర్తిస్తారన్నది కాషాయం ఆలోచనగా కనిపిస్తుంది. అందుకోసం గట్టి కసరత్తులు మొదలు పెట్టింది. చంద్రబాబు అండ్ కో చేసిన అవినీతిపై ఆధారాలతో కేసులు పెట్టాలన్న డిమాండ్ ను వైసిపి సర్కార్ పై క్రమంగా పెంచుతూ వస్తుంది బిజెపి.బిజెపి వ్యూహాన్ని రాజకీయ చాణుక్యుడు టిడిపి అధినేత చంద్రబాబు గుర్తించారు. అందుకే ఆయన స్నేహ గీతాలు ఆలపిస్తున్నారు. అవసరమైతే బిజెపి తో ఫిఫ్టీ ఫిఫ్టీ అనే రేంజ్ లో సంకేతాలు పంపించినట్లు కమలనాధులు చెబుతున్నారంటే రాబోయే విపత్తు బాబుకు అర్ధమైంది అంటున్నారు. 
బాబు స్నేహగీతం వెనుక...

అవసరమైతే ఎన్డీయే తో తిరిగి కలిసి నడుస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడం గతంలో బిజెపి తో చెలిమికి దూరం కావడం తన ఘోరపరాజయాలకు రీజన్స్ గా ఇప్పటికే చంద్రబాబు గుర్తించారు. అందుకే తెరముందు, తెరవెనుక కమలంతో కలిసేందుకు చేతులు చాస్తున్నారు చంద్రబాబు. తద్వారా వారితో పొత్తు వున్నా లేకపోయినా బిజెపి తీర్ధంపుచ్చుకోవాలనుకుంటున్న పసుపు నేతల దూకుడుకు తాత్కాలికంగా చంద్రబాబు బ్రేక్ వేయగలిగారు.చంద్రబాబు వ్యూహాన్ని కమలనాధులు గుర్తించారు. తమ పార్టీలోకి వలసలు అడ్డుకోవడానికి ఆయన వేసిన ఎత్తును చిత్తు చేసే వ్యూహాన్ని అమల్లో పెట్టారు. మోడీ అమిత్ షా టిడిపి ఎన్డీయే లో చేరేందుకు సిద్ధంగా వున్నా తలుపులు మూసేశారని పదేపదే క్లారిటీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎపి బిజెపి ఇంచార్జి సునీల్ దేవర్, అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఇప్పుడు ఇదే మాటను తేడా లేకుండా నొక్కి చెబుతున్నారు. ఇక ఎపి లో టిడిపికి మనుగడే లేదంటూ గట్టి ప్రచారం సాగిస్తున్నారు. ప్రత్యామ్నాయం తామే అని నొక్కి చెబుతున్నారు. తద్వారా టిడిపి నుంచి వలసలకు డోర్లు తెరిచి ఉంచామని ఆ పార్టీ ఎన్డీయే లోకి తిరిగి చేరడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పినట్లే అవుతుంది. అలాగే జనసేన మాజీ లకు బిజెపి షెల్టర్ ఇస్తామని హామీ ఇచ్చిందితమ పార్టీ గేట్లు మూసేస్తే బిజెపి లోకి టిడిపి పెద్ద తలకాయలు చేరుతున్న పరిస్థితిని వైసిపి గుర్తించింది. నెమ్మది నెమ్మదిగా ఇతర పార్టీల నుంచి చేరేవారికి ద్వారాలు తీస్తుంది. ఫలితంగా వారంతా బిజెపి గుమ్మం తొక్కకుండా వుండే వ్యూహాన్ని అమలు చేస్తుంది. తోటత్రిమూర్తులు నుంచి అంతా ఇలాగే బిజెపి ఆలోచన పక్కన పెట్టి వైసిపి లోకి జంప్ కావడానికే ప్రాధాన్యత ఇస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క టిడిపి నుంచే కాకుండా జనసేన నేతలకు ఆఫర్లతో కూడిన ఆఫర్ లు వైసిపి నుంచి ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎపి లో రాజకీయాలు భలే రంజుగా మారాయి.