బెజవాడలో ఉమా వర్సెస్ అవినాష్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బెజవాడలో ఉమా వర్సెస్ అవినాష్

విజయవాడ, అక్టోబరు 24, (way2newstv.com)
బెజ‌వాడ టీడీపీ రాజ‌కీయాలు చాలా హాట్‌గా మారాయంటున్నారు ప‌రిశీల‌కులు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా అంటున్నారు. ఒక నేత కోసం.. మ‌రో నేత‌కు ఎస‌రు పెడుతున్న రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ని కూడా చెబుతున్నారు. దీంతో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఇక్క‌డి తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014 స‌హా తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన గ‌ద్దె రామ్మోహ‌న్ విజ‌యం సాధించారు. ఈయ‌న సీనియ‌ర్ నేత‌, అంద‌రినీ క‌లుపుకొని పోయే నాయ‌కుడిగా, వివాద ర‌హిత నాయ‌కుడిగా కూడా ప్ర‌జ‌ల నుంచి మ‌న్న‌న‌లు అందుకున్నారు.అయితే, ఈయ‌న‌కు టీడీపీలో కీల‌కంగా ఉన్న మాజీ మంత్రి, ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని ఉమాకు కూడా అంత‌ర్గ‌తంగా క‌ల‌హాలు ఉన్నాయి. 
బెజవాడలో ఉమా వర్సెస్ అవినాష్

ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లే అయిన‌ప్ప‌టికీ.. ఉమాను వ్య‌తిరేకించే వారు చాలా మందే ఉన్నారు. ఆయ‌న శైలి, ఆయ‌న చేసే తెర‌చాటు రాజ‌కీయాల‌తో వీరు విసిగెత్తిపోయి ఆయ‌న‌తో క‌నీసం మాట్లాడేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో ఇప్పుడు ఉమా ఏకంగా గ‌ద్దె రామ్మోహన్ కు ఎసరు పెట్టాల‌ని డిసైడ్ అయ్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఉంది. విజ‌య‌వాడ‌కు దేవినేని బంధువు దేవినేని అవినాష్‌.. టీడీపీలో తెలుగు యువత రాష్ట్ర అధ్య‌క్షుడుగా ఉన్నారు.అయితే, ఈయ‌న టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. తాను తూర్పు నుంచి పోటీ చేస్తాన‌ని అంటే.. తాజా ఎన్నిక‌ల్లో త‌న‌కు గుడివాడ ఇచ్చార‌ని, నాన్ లోక‌ల్ కావ‌డంతో తాను ఓడిపోయాన‌ని, కోట్లాది ర‌పాయ‌లు వ‌దిలించుకున్నాన‌ని… వ‌చ్చే ద‌ఫా కూడా అదే నియోజక‌వ‌ర్గం ఇచ్చినా..తన‌కు గెలిచే అవ‌కాశం లేద‌ని, ఇక్క‌డున్న మంత్రి కొడాలి నాని బ‌లంగా ఉన్నార‌ని…. కాబ‌ట్టి త‌న‌కు తూర్పు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని ఆయ‌న అంత‌ర్గ‌తంగా డిమాండ్‌ వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, టీడీపీలో అవినాష్ డిమాండ్‌ను ప‌ట్టించుకునే వారు క‌నిపించ‌డం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌గ‌న్ సునామీని కూడా త‌ట్టుకుని నిల‌బ‌డ‌డంతో ఆయ‌న‌ను మార్చే ఉద్దేశం లేదు.ఇదిలావుంటే, అవినాష్ అసంతృప్తిని గ‌మ‌నించిన వైసీపీ ఆయ‌న‌కు గేలం వేసింది. ఆయ‌న పార్టీ మారి వైసీపీ కండువా క‌ప్పుకొంటే..తాము తూర్పు నియోజ‌క‌వ‌ర్గం అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. దీంతో అవినాష్ పార్టీమారేందుకు రెడీ అవుతున్న‌ట్టు సంకేతాలు వ‌స్తున్నాయి. వీటిని గ‌మ‌నించిన మాజీ మంత్రి, అవినాష్‌కు బంధువు అయ్యే దేవినేని ఉమా.. వెంట‌నే రంగంలోకి దిగి అవినాష్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గ‌ద్దె రామ్మోహన్ ను త‌ప్పించే బాధ్య‌త త‌న‌ద‌ని అవినాష్‌కు హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఎలాగో ఒక‌లా గ‌ద్దె రామ్మోహన్ ను త‌ప్పించి నీకు తూర్పు బాధ్య‌త‌లు అప్ప‌గించేలా చూస్తాన‌ని…. పార్టీ మారొద్ద‌ని సూచించార‌ట‌.ఇక‌, ఈ విష‌యం గ‌ద్దె రామ్మోహన్ కు తెలియ‌డంతో ఉమాపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అవుతున్నారట‌. త‌న గెలుపును తానే నిర్ణ‌యించుకోలేని నాయ‌కుడు త‌న‌ను త‌ప్పిస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డం ఏంటి.. దీనిపై ఏదో ఒక‌టి తేల్చాల్సిందేన‌ని అధినేత వ‌ద్దే పంచాయితీ పెట్టేందుకు రెడీ అవుతున్నార‌ట‌., ఇది బెజ‌వాడ టీడీపీ ప‌రిస్థితి . మ‌రి ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి. ఇక గ‌ద్దె రామ్మోహన్ ను త‌ప్పించే ప్ర‌య‌త్నాలు ఉమా చేయ‌డం ఇప్పుడే కాదు 2014 ఎన్నిక‌ల్లోనే జ‌రిగింది అప్పుడు గ‌ద్దె భార్య అనూరాధ‌కు జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ ఎనౌన్స్ చేయ‌డంతో ఉమా తూర్పులో గ‌ద్దె రామ్మోహన్ ను త‌ప్పించి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న య‌ల‌మంచిలి ర‌వికి టీడీపీ సీటు ఇచ్చేలా చ‌క్రం తిప్పారు. చివ‌ర‌కు గ‌ద్దె దంప‌తుల బెదిరింపుల‌తో చంద్ర‌బాబు వెన‌క్కు త‌గ్గారు.