హైదరాబాద్ అక్టోబరు 9, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐదో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. దసరా సమయంలో బస్సులు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఐదోరోజూ బస్సులు బంద్
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదు. కార్మికులు వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేట్ బస్సుల చార్జీలు మోతమోగుతున్నాయి. డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు.