అక్టోబరు నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్టోబరు నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి  అక్టోబర్ 11 (way2newstv.com)
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.  వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
- అక్టోబరు 13న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు.
అక్టోబరు నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

- అక్టోబరు 18న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగిభక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం ఆస్థానం నిర్వహిస్తారు.
- అక్టోబరు 21న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.
- అక్టోబరు 22న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
- అక్టోబరు 21న శ్రీ మానవాల మహాముని ఉత్సవారంభం.
- అక్టోబరు 25న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులనుకటాక్షించనున్నారు.
- అక్టోబరు 27న సాయంత్రం 5.30 గంటలకు దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.
- అక్టోబరు 30న తిరుమల నంబి సాత్తుమొర.