హైదరాబాద్ అక్టోబరు 22, (way2newstv.com)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించి పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది.
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. దీంతో మున్సిపల్ ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.