ఏపీ లో మూడు రోజులు భారీ వర్షాలు

అమరావతి అక్టోబరు 22, (way2newstv.com)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో కోస్తా,  ఉత్తరాంధ్ర,  రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వెల్లడించింది. చిత్తూరు,  అనంతపురం,  నెల్లూరు,  ప్రకాశం,  గుంటూరు,  కృష్ణా,  ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు వున్నాయని పేర్కోంది. 
ఏపీ లో మూడు రోజులు భారీ వర్షాలు

బుధవారం, గురువారం కూడా కోస్తా,  ఉత్తారాంద్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. *రాయలసీమలో వాగులు,  వంకలు,  నదుల్లో భారీగా వర్షపు నీరువచ్చే అవకాశాలున్నాయి. ప్రజలు వాగులు,  నదులు దాటకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సూచించింది.
Previous Post Next Post