శ్రీశైలం అక్టోబరు 29 (way2newstv.com)
శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది.
దీంతో రెండు క్రస్ట్గేట్ల ద్వారా మాత్రమే సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు. సోమవారం సాయంత్రం 6గంటల సమయానికి 884.70 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 213.8824 టీఎంసీలుగా నమోదయ్యా యి.
శ్రీశైలం లో తగ్గిన వరద నీరు
జలాశయానికి 1,71,794 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 69,012 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. డ్యాం 2 రేడియల్ క్రస్ట్ గేట్ల ను 10 అడుగుల మేర ఎత్తి 55,874 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి ఔట్ఫ్లో 1,24,886 క్యూసెక్కులు ఉంది.మంగళవారం ఉదయానికి రిజర్వాయర్ లో 214.8450 టీఎంసీల నీరు నిల్వ వుంది.
Tags:
Andrapradeshnews