అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా ఇండ్లు : హరీష్ రావు

సిద్దిపేట అక్టోబర్ 23( way2newstv.com)
 నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిరుపేదలకు నిలువెత్తు గౌరవం అని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లను నిర్మించి ఇవ్వడం లేదు. 
అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా ఇండ్లు : హరీష్ రావు

అన్ని వసతులతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా ఇండ్లు కట్టించి ఇస్తాం. వ్యవసాయాన్ని లాభదాయకం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. యువత సోషల్ మీడియా ఊబిలో చిక్కుకోవద్దు. సమయాన్ని కూడా వృథా చేయడం మంచిది కాదు. కష్టపడి పని చేయాలనుకుంటే అనేక అవకాశాలున్నాయి. యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.
Previous Post Next Post