అక్రమంగా ఇసుక డంప్ చేస్తే కఠిన చర్యలు
మంత్రాలయం అక్టోబర్ 31(way2newstv.com):
శివారులో ఉన్న మారుతి ఫ్యాక్టరీ వెనక భాగంలో అక్రమ ఇసుక డంప్ చేశారన్న సమాచారం రావడంతో స్థానిక కృష్ణయ్య, ఎంఆర్ఓ,చంద్రశేఖర్ తో కలసి ఇసుక డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా పదిహేను ట్రిప్పుల ఇసుక ఉంటుందని అంచనా వేశారు.
అక్రమ ఇసుక డంప్ స్వాధీనం.
ఈ సందర్భంగా సిఐ కృష్ణయ్య ఎంఆర్ఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా ఇసుక డంప్ చేసిన, అక్రమంగా ఇసుక తరలిస్తున్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యస్ ఐ లు ఎర్రన్న,మాధవరం యస్ఐ.బాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్వో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర నిల్వ ఉంచిన ఇసుకను మీ సేవలో చలానా చెల్లించిన ఎమ్మిగనూరు వాసులకు 34 వేల రూపాయలకు విక్రయించినట్లు తెలిపారు.
Tags:
News