పంచాయితీ కార్మికులకు వేతనాల పెంపునకు ఉత్తర్వులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పంచాయితీ కార్మికులకు వేతనాల పెంపునకు ఉత్తర్వులు

జగిత్యాల  అక్టోబర్ 15 (way2newstv.com)
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పని చేస్తున్న ఉద్యోగ కార్మికులకు వేతనాలు పెంచడం జీవో  ఎంఎస్ నెంబర్ 51 తేదీ. 14 10. 19వ  ద్వారా సోమవారం పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారని ఉద్యోగ జేసి జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు అశోక్ కుమార్ తెలిపారు. 
పంచాయితీ  కార్మికులకు వేతనాల పెంపునకు ఉత్తర్వులు

ఇక నుంచి పంచాయతీల్లో పని చేస్తున్న వారు పూర్తి కాలపు ఉద్యోగిగా పని చేయాలని ,వేతనం రూ 8,500 చెల్లిస్తారని అందుకు ప్రభుత్వం గ్రాండ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో పొందుపరిచారని తెలిపారు. వేతనాల పెంపు జీవో విడుదల పట్ల తమ సంఘం తరఫున హరి అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కారోబార్ మూడవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఈ పోస్టులు భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.