తెలంగాణలో ఆర్టీసీ సమ్మె - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్ అక్టోబరు 5, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమయింది.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండు తో ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మిక
సంఘాలు జెఎసి నాయకులు.. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన  విషయం తెలిసిందే. పలు చోట్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల తాత్కాలిక సిబ్బందితోబస్సులు నడిచాయి.  డిపోల ముందు పోలీసులు రాత్రినుంచి బందోబస్తు ఏర్పాట్లు చేసారు.  బస్సులను అడ్డుకున్న నేతలను, కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె

సిద్దిపేట జిల్లాహుస్నాబాద్ లో తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుండి ఆర్టీసీ కార్మికులు గేటు ముందు బైటాయించి ధర్నా నిర్వహించారు.  కార్మికులకు మద్దతుగా విపక్ష నాయకులుధర్నాలో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.  పోలీసులు ధర్నా చేస్తున్న నాయకులు కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు కార్మికుల సమ్మెతో డిపో నుంచిఒక్క బస్సు కూడా బయటకు రాలేదుసమ్మె కారణంగా యాదగిరిగుట్టలో93 బస్సులు  డిపోకే పరిమితమైనాయి,.  పోలీసులు  భారీగా మోహరించారు. పోలీసుల పహారాలో ప్రైవేట్ డ్రైవర్ల సహకారంతో యాదగిరిగుట్ట ఆర్టీసీడిపో నుంచి బయటకు వచ్చిన రెండు బస్సులు. దినసరి వేతనం కింద డ్రైవర్ కు రూ.1500, కండక్టర్ కు రూ.1000 చొప్పున ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది.ఉమ్మడి మెదక్ జిల్లా లో భారీ పోలీస్ బందోబస్స్తు మధ్య బస్సులు నడిచాయి. ప్రతి డిపో ముందు భారీగా  పోలీసు బలగాలు వచ్చాయి.   మధిర లో  ఆర్టీసీ కార్మికులు కు  మద్దతుతెలుపుతూ  డిపో వద్ద  బస్ లను అడ్డుకొని  నిరసన తెలుపుతున్న నాయకులను అరెస్ట్ చేసి టౌన్ పోలీసు స్టేషన్ కి  తరలించారు.