శ్రీవల్లిక ప్రొడక్షన్స్ పతాకంపై చింటు కంచర్ల, కావ్య కీర్తి, అదిత్య రెడ్డి కె.ధనుష్ బాబు, సోఫియా ,ప్రధాన పాత్రల్లో ముస్కు రాం రెడ్డి దర్శకత్వంలో కురుపాల విజయ్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "నాకిదే ఫస్ట్ టైమ్". శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత విజయ్ కుమార్ మాట్లాడుతూ" మా డైరెక్టర్ రాం రెడ్డి చెప్పిన కథ అద్భుతం గా ఉంది.
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న"నా కిదే ఫస్ట్ టైమ్"
ఇదో చక్కటి ప్రేమ కధ. ఈ కధ లో అనేక ట్విస్టులు ఉంటాయి. మా మూవీ లో ప్రతి ఫ్రేమ్ చాలా రీచ్ గా ఉంటుంది. సింగర్ శ్రావణ భార్గవి పాడిన సాంగ్ ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటుంది. ప్రేక్షకులను థ్రిల్ చేసే కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రం లో పొందు పరచడం జరిగింది. దసరా తర్వాత సెకండ్ షెడ్యూల్ ప్రారంబించి గోవా ,అరకు లలో పాటల చిత్రీకరణ జరపనున్నాం." అన్నారు.జె ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కూరకుల, ఫైట్స్:వజ్రాలు, కెమెరా:గోపి,కో డైరెక్టర్:హర్ష, లైన్ ప్రొడ్యూసర్:ఆగస్టీన్ ,స్క్రీన్ ప్లే:విజయ్, నిర్మాత: కురుపాల విజయకుమార్, కధ, మాటలు, దర్శకత్వం:ముస్కు రాంరెడ్డి.