పౌష్టికాహారంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పౌష్టికాహారంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

అమరావతి అక్టోబర్ 23(way2newstv.com)
రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మొదట దశలో  రక్తహీనత, పౌష్టికాహారలోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్ప్లాన్ ప్రాంతాల్లోని గర్భవతులు, 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచుతూ పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి  నిర్ణయించారు. 77 గిరిజన, సబ్ప్లాన్ మండలాల్లో డిసెంబర్ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని అయన అన్నారు. గర్భవతులకు, బాలింతలకు నెలకు రూ.1062ల విలువైన ఆహారం,  25 రోజలుపాటు రోజూ భోజనం, గుడ్డు, 200మి.లీ. పాలు, రూ. 500 విలువ చేసే వైయస్సార్ బాలసంజీవని కిట్ ఇవ్వాలని నిర్ణయించారు. (వైయస్సార్ బాలసంజీవని కిట్లో మొదటివారం రెండు కేజీల మల్టీ గ్రెయిన్ ఆటా, రెండోవారం అరకేజీ వేరుశెనగలతో చేసిన చిక్కీ, మూడోవారం అరకేజీ రాగి ఫ్లేవర్ మరియు అరకేజీ బెల్లం, నాలుగోవారం అరకేజీ నువ్వులుండలు) వుంటాయి. 
పౌష్టికాహారంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

అలాగే 77 గిరిజన, సబ్ప్లాన్ మండలాల్లోని 3–6 సంవత్సరాల్లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజలు పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించారు. నెలకు రూ. 560లతో పౌష్టికాహారం అందించనున్నారు. నెలలో 25 రోజులపాటు భోజనం, గుడ్డు, 200 మి.లీ. పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం
ఈప్రాజెక్టు క్రింద శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 7, విశాఖపట్నం 11, తూర్పుగోదావరి 11, పశ్చిమగోదావరి జిల్లాలో 6 గిరిజన మండలాలతో మొత్తం 36 మండలాలు ఎంపిక చేసారు.    సబ్ప్లాన్ ఏరియాకు సంబంధించి శ్రీకాకుళం 19, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 3, ప్రకాశం 3, కర్నూలు 3, గుంటూరు జిల్లా నుంచి 3 మండలాలు కలిపి మొత్తం 41 మండలను గుర్తించారు.
 మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టిపెట్టాలి, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి.. పిల్లలు ఏం తింటున్నరన్నదానిపై చూడండి. ఆతర్వాత ఎలాంటి మార్పులు చేయాలన్నదానిపై సూచనలు చేయండి. పిల్లలకు మంచి మెనూతో భోజనం పెట్టాలని అయన అన్నారు.