కడప అక్టోబర్ 19 (way2newstv.com)
మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. పాఠశాలల అభివృద్ధి కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యనందించి జాతీయ స్థాయిలో నిలబెట్టాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలవు సురేష్ అన్నారు. శనివారం అయన కడపలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల్లా కాదు ఉద్యమంలా పని చెయ్యాలి. నలబై నాలుగు వేల పాఠశాలలను సమూలంగా మూడేళ్ళ కాలంలో కార్పొరేట్ విద్యాలయాలుగా పఠిష్ట పరిచాలి. ఇందులో అందరూ భాగస్వామ్యులు కావాలి.
చేతల ప్రభుత్వం
ప్రభుత్వాలు మారినా అమలు చేస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బాలికల కళాశాల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. పైకప్పు పెచ్చులూడి కూలే పరిస్థితి ఉంది. ఎందుకు వాటిపై దృష్టి సారించడం లేదు. నాణ్యత ప్రమాణాలను పాటించాలి. విద్యాశాఖను పఠిష్ట పరచేందుకు జవాబు దారి తనంతో పని చెయ్యాలని సీఎం జగన్ భావిస్తున్నారు. మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం. నూతనమైన విధానాలతో పాఠశాలలను మార్పు చేద్దాం. జవాబుదారీతనం, పారదర్శకం గా, అవినీతి రహిత పాలన అందిస్తామని మంత్రి అన్నారు.