పసిపిల్లలపై పడగ విప్పిన డెంగ్యూ.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పసిపిల్లలపై పడగ విప్పిన డెంగ్యూ..

వరంగల్, అక్టోబర్ 30, (way2newstv.com)
బాహ్య ప్రపంచానికి అడుగుపెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు. నవమాసాలు మోసి కన్న తల్లి తండ్రుల హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. కల్లెదుటే పసిగుడ్డుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే.. తల్లులకు కడుపుకోత మిగులుతోంది కొంత మంది పిల్లలను అత్యవసర సమయంలో వైద్యం అందించి బతికించే అవకాశం ఉన్నఅరకొర వైద్య సౌకర్యాలు, కనీస మౌళిక వైద్య పరికరాలు లేకపోవడం దీనికితోడు వైద్య సిబ్బంది నిర్లక్షం వల్ల అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్న ఘటన అక్కడో.. ఇక్కడో.. ఎక్కడో కాదు.. ఉత్తర తెలంగాణలో పేదలకు పెద్ద దిక్కుగా వైద్యసేవలు అందిస్తున్న వరంగల్ ఎంజిఎం పిల్లల విభాగంలోని పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ వార్డులో చిన్న బాధ కలిగిన చెప్పుకోలేని పసిప్రాణాలపై వైద్యుల నిర్లక్షం.. అడుగడుగునా అసౌకర్యాల నడుమ అల్లాడుతున్న చిన్నపిల్లలపై దయలేని పరిస్థితి ఏర్పడింది
పసిపిల్లలపై పడగ విప్పిన డెంగ్యూ..

ఇటీవలే 26 రోజుల కాల వ్యవధిలో ఎంజిఎం పిల్లల విభాగంలో డెంగ్యూ విషజ్వరాలతో అస్వస్థతకు గురై ఈరోజుకి 52 మంది చిన్నపిల్లలు మృతిచెందినట్లు సమాచారం. సకాలంలో వైద్యం అందక ఒకేరోజు ఐదుగురు చిన్నారులు మృతిచెందడంతో ఒక్కసారిగా పిల్లల విభాగం కుటుంబ రోధనలతో, ఆర్తనాదాలతో నిండిపోవడం, వరుసుగా పసిప్రాణాల ఊపిరి ఆగిపోతుంటే హృదయాలు ధ్రవీంచి పలువురు తల్లిదండ్రులు భయాందోళనలకు గురై ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తున్నట్లు బాధితులు తెలుపుతున్నారు.డెంగ్యూ వ్యాధి ప్రబలుతుందనే మాట వినగానే చాలా మంది తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. జ్వరాల్లో అతి భయంకరమైన జ్వరంగా భయపట్టేది డెంగ్యూ. వాతావరణ మార్పులతో పాటు విషజ్వరాలు, డెంగ్యూ జ్వరం నగరంలో చిన్నపిల్లలపై పాములా పడగ విప్పి ప్రాణాంతకమైన వ్యాధిగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల నుండి మొదలు కొని గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల నుండి రావడంతో ఎంజిఎం పిడియాట్రిక్ విభాగం రద్దీగా మారింది. వచ్చే రోగుల సంఖ్యకు పడకల సామర్థం తక్కువగా ఉండడం వల్ల ఒకే బెడ్‌పై అత్యవసర విభాగంలో సైతం ముగ్గురు చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంజిఎం పిల్లల విభాగానికి ఒపికి రోజుకు 500-600ల మంది పిల్లలు ఔట్ పేషేంట్లు వస్తుండడం గమనార్హం.మరో 50 నుండి 80 మంది ఇన్‌పేషెంట్ వైద్యం కోసం వార్డులో చేరుతుంటారు. పిల్లల చికిత్సకు అధునాతన సౌకర్యాలు ఉన్నా ఏకైక వార్డు ఇదొక్కటే కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నలుమూలల నుండి వచ్చే చిన్నారుల రోగాల బారిన పడిన వారిని కోటి ఆశలతో తమ పిల్లల ప్రాణాలు దక్కించుకోవాలని వస్తే ఇక్కడి ఆస్పత్రి యమపాశంగా మారింది. ఏటేటా పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యసేవలు అందకపోవడంతో చిన్నపిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య పరికరాలు లేమి.. వసతుల కొరత.. అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్షం వెరసీ ప్రభుత్వ వైద్యం అందని దయనీయ పరిస్థితి నెలకొంది.డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడిన పిల్లలకు తగిన వైద్యం చేయడానికి ఎంజిఎం పిల్లల విభాగంలో కనీస వైద్య పరికరాలు లేవు.. వైద్యులు, సిబ్బంది, ఔషధాల కొరత వల్ల మెరుగైన చికిత్స అందడం లేదు. గత ఐదురోజుల క్రితం పిల్లల విభాగంలో ఐవిక్యాన్‌ల సప్లై లేకపోవడంతో గ్లూకోజ్ బాటిల్ పెట్టలేని పరిస్థితి ఏర్పడంతో బాధితులు బయట కొనుగోలు చేసి వైద్యం తీసుకున్న పరిస్థితి నెలకొంది. పిల్లల రక్త పరీక్షల కోసం మూడు రోజులు వేచి చూడాల్సిందే.. ప్లేట్‌లేట్లు ఉన్నపాటిగా తగ్గిపోతే పరిస్థితి సీరియస్‌గా ఉండి మెరుగైన వైద్యం కోసం బయటకు వెళ్లండని తరువాత మమ్మల్ని బదనాం చేయోద్దని వైద్యులుఎంజిఎం పిడియాట్రిక్ విభాగం ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయి పిల్లల ఆస్పత్రి ఇప్పటి వరకు లేదు. ప్రభుత్వం ఎంజిఎంలోని పిల్లల విభాగాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి తరహాలో ప్రత్యేకంగా ప్రభుత్వ పిల్లల ఆస్పత్రి ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుపేద ప్రజలు తమ పిల్లలకు ఎంజిఎం పిల్లల విభాగంలో కార్పొరేట్ వైద్యసేవలు అందించే విధంగా వైద్యుల, ఔషధాల కొరత లేకుండా రోగాల బారిన పడిన పిల్లలకు సరైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని అధికారులను, వైద్యులను బాధితులు వేడుకుంటున్నారు.