లెటర్ హెడ్ ప్రెసిడెంటేనట... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లెటర్ హెడ్ ప్రెసిడెంటేనట...

శ్రీకాకుళం, అక్టోబరు 21, (way2newstv.com)
ఆయన ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కానీ లెటర్ హెడ్ లకే పరిమితం. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. కళా వెంకట్రావు 2014 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వత టీడీపీ అధ్యక్షుడు అయ్యారు. అయితే సభా వేదికపై అధ్యక్షుడిగా కుర్చీ తప్ప వేరే పనిని కళా వెంకట్రావుకు చంద్రబాబు అప్పగించింది లేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కావడంతో జాతీయ అధ్యక్షుడిగా ఉండటంతో రాష్ట్ర పార్టీకి కళా వెంకట్రావును అధ్యక్షుడిగా నియమించారు.అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కళా వెంకట్రావు పార్టీకి చేసిందేమీ లేదు. 
లెటర్ హెడ్ ప్రెసిడెంటేనట...

జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ రాజకీయాల్లోనే ఉండటంతో కళా వెంకట్రావు కేవలం అప్పటి విపక్షనేతలకు, కేసీఆర్ కు, మోడీకి లేఖలు రాయడానికే తన సమయాన్ని వెచ్చించారు. ఇక ఎన్నికల సమయంలో కీలకమైన అభ్యర్థుల ఎంపికలోనూ కళా వెంకట్రావు పాత్ర లేదు. అభ్యర్థుల ఎంపికలో అంతా చంద్రబాబు, నారాలోకేష్ మాత్రమే చూసుకున్నారు. చివరకకు ఆయన సొంత జిల్లా శ్రీకాకుళం అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కళావెంకట్రావు అభిప్రాయాలను తీసుకోలేదన్నది వాస్తవం. కీలక నిర్ణయాల్లోనూ ఆయన ప్రమేయం లేదు.కళావెంకట్రావు 2019 ఎన్నికలలో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు ఓటమి పాలు కావడంతో ఆయనను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించాలని చంద్రబాబు ఎన్నికల ఫలితాల అనంతరం భావించారు. కళా వెంకట్రావు స్థానంలో కింజారపు రామ్మోహన్ నాయుడును నియమించాలనుకున్నారు. బీసీ నేతలకే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. సంస్థాగత ఎన్నికల తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశముంది.ఇవన్నీపక్కనపెడితే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి, విశాఖ,నెల్లూరు జిల్లాల పర్యటనలు చేశారు. అక్కడ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాత్రం కన్పించడం లేదు. ఆయన అమరావతిలో మీడియా సమావేశాలకే పరిమితమయ్యారు. పార్టీ ఓటమి తర్వాత బలోపేం చేసే పనిలో రాష్ట్ర అధ్యక్షుడిని భాగస్వామ్యం చేయాల్సి ఉన్నా కళా వెంకట్రావుపై చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకే ఆయనను సమీక్షలకు దూరంపెడుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. త్వరలోనే పదవి కూడా ఊడటం ఖాయమన్న సంకేతాలు ఇప్పటికే కళాకు అందినట్లు తెలుస్తోంది.