సీఎం కేసీఆర్, గవర్నర్ హజరు
హైదరాబాద్ అక్టోబర్ 02,(way2newstv.com):
దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుతున్నారు. తెలంగాణలోనూ మహాత్మాగాంధీ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
బాపూఘాట్ లో బాపూజీకి ఘన నివాళులు
నగరంలోని లంగర్హౌస్లో బాపూఘాట్ వద్ద మహాత్మునికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనంలో గవర్నర్, సిఎం పాల్గొన్నారు. ఇక, శాసనసభ ఆవరణలోనూ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికిమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు...