నోరూరిస్తున్న తాండ్ర... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నోరూరిస్తున్న తాండ్ర...

విజయనగరం, అక్టోబరు 10, (way2newstv.com)
మామిడి తాండ్ర.. ఆ పేరు వింటేనే నోరూరుతోంది కదూ. లక్కవరపుకోట మండలం భీమాళి ఈ తాండ్ర తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే ఈ పదార్థానికి దేశ, విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయుకులు తమ పనులు చేయించుకోవాలంటే భీమాళి తాండ్రను తాయిలంగా ఇచ్చేవారట. ఏడాది పొడవునా ఇక్కడ తాండ్ర చెక్కుచెదరని రుచితో లభిస్తుంది. 
 నోరూరిస్తున్న తాండ్ర...

దాదాపు 350 కుటుంబాల వారు ఈ తాండ్ర తయారీపైనే ఆధారపడుతూ జీవిస్తున్నారు. మండు వేసవి వచ్చిందంటే గ్రామస్తులంతా వీటి తయారీతో బిజీ అయిపోతారు. మామిడి పండ్ల రసంతో దీనిని తయారు చేస్తారు. కోలంగోవ, కలెక్టర్‌ వంటి రకాలను వీటికి వాడుతారు. బాగా పండిన మామిడి పండ్ల రసాలను ప్రత్యేంగా మహిళలు తీసి సమపాళ్లలో చక్కెర కలిపి వెదురు చాపలపై పొరలు పొరలుగా వేసి ప్రకృతి సిద్ధంగా ఎండలో ఆరబెడతారు. ఇలా ఒక రెండు ఇంచీల మందం వరకు వేసి పూర్తిగా ఎండిన తరువాత కేజీకి ఒక ముక్క చొప్పున కట్‌ చేసి పెకింగ్‌ చేసి అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుతం తాండ్ర కిలో ధర రూ.120లకు అమ్ముతున్నారు.