హుజూర్ నగర్ అక్టోబరు 21, (way2newstv.com)
హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏడుగంటలకు ఎన్నికల పరిశీలకులు, రాజకీయపార్టీల ఏజెంట్స్ సమక్షంలో ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ ప్రారంభం చేశారు.
ఉపఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
పోలింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకమిషన్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ పోలింగ్ కోసం 302 పోలింగ్ కేంద్రాల్లో పిఓలు,ఎపిఓలు,ఓపిఓలతో పాటు ఇతర సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 27 సేక్టార్లలోని 300 రూట్లకు 1200 సిబ్బందిని నియమించారు. రిజర్వడ్ గా 140 మంది అధికారులను సిద్ధం చేశారు. సామాగ్రి పంపిణీకోసం ఏర్పాటుచేసిన 27 సెక్టార్లద్వారా ఇవిఎంలను ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు.