తన దాకా వస్తే గానీ... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తన దాకా వస్తే గానీ...

విజయవాడ, అక్టోబరు 12, (way2newstv.com)
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి తొమ్మిదేళ్ళు విభజన తరువాత ఐదేళ్ళు మొత్తం 14 ఏళ్ళు అధికారం చెలాయించిన అనుభవశీలి ఆయన. చంద్రబాబు హయాంలో మొదటి తొమ్మిదేళ్ళు ఎలా వున్నా 2014 నుంచి 2019 వరకు పోలీసులను వినియోగించిన తీరు పదేపదే అపహాస్యం పాలయ్యింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు ఎవరైనా సరే వారికి ముందుగా గృహనిర్బంధం అయినా లొంగకపోతే అరెస్ట్ లు ఇక సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టె వారిని శ్రీకృష్ణ జన్మస్థానంకి పంపడం రొటీన్ గా జరిగేవి. ఇక ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు వంటివి చేస్తామని ప్రకటిస్తే చాలు ముందే సర్కార్ ఆదేశించకుండానే పోలీసులు చక్కబెట్టేశావారు. 
తన దాకా వస్తే గానీ...

రాజుల పాలనను తలపించే విధంగా చంద్రబాబు అలా తన హవా నడిపించడానికి అనుభవం అంతా రంగరించేశారు.ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తూ సాగిన చంద్రబాబు పాలన లో వైసిపి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అధికారంలోకి వస్తే తడాఖా చూపాలన్న వారికి పగ్గాలు దక్కాయి. ఇంకేముంది చంద్రబాబు కే దిమ్మతిరిగేలా పోలీసు అస్త్రాన్ని బయటకు తీసింది వైసిపి. ఇంకేముంది టిడిపి గతంలో చేసిన పనులే డోస్ పెంచి మరి ట్రీట్ మెంట్ ఇస్తుంది వైసిపి. పోలీసులకు ఈ స్టయిల్ సరదాగానే వుంది. రాజకీయం చేతిలో సాధనంగా మారడం నిజాయితీగల వారికి అస్సలు నచ్చదు.అందుకే తమకు పవర్ ఇస్తే ఫ్రస్టేషన్ లో వున్నవారు అంతా కిల్ బిల్ పాండే లు అయిపోతున్నారు. దాంతో ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు డీలా పడ్డారు. పోలీసులపై సామదాన దండోపాయాలు ప్రయోగించేలా తన మాటలతో చంద్రబాబు బెదిరిస్తున్నారు. పోలీసులు ఇలా వేధిస్తే ఎలా అని మీరు రాజీనామాలు చేసి వైసిపి పార్టీలో చేరిపోండని చంద్రబాబు అంతటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వాపోవడం ఇప్పుడు వైసిపి లోనే కాదు టిడిపి శ్రేణుల్లో కూడా చర్చనీయాంశం అయ్యింది. పోలీస్ మార్క్ టార్చర్ విపక్షాలకు రుచి చూపించి అంతలోనే అధికార మార్పిడి తో తానే ఎదుర్కొవాలిసి రావడం ఇంత పెద్ద వయసులో అది భరించడం కష్టమే మరి