మంత్రుల అడ్రస్ కోసం వెతుకాలట - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మంత్రుల అడ్రస్ కోసం వెతుకాలట

హైద్రాబాద్, అక్టోబరు 5, (way2newstv.com)
పాత సచివాలయం మూత పడటంతో మంత్రుల ఛాంబర్లు హైదరాబాద్‌లో చెల్లాచెదురు అయిపోయాయి. సచివాలయంలో చాంబర్‌లు ఉండి ఉంటే అధికారులకు,ప్రజలకు మంత్రులు అందుబాటులో ఉండటం సులభమయ్యేది. ఇప్పుడు పాత సచివాలయం మూత పడటంతో మంత్రులు తమ శాఖ పరిధిలోని కమిషనరేట్‌ ఆఫీసులలో లేదా సంబంధిత విభాగాల కార్యాలయాల్లో ఛాంబర్లను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో మంత్రులు నగరంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావడం కష్టంగా మారింది. దీంతో కొందరు మంత్రులు తమ ఛాంబర్లను నామ మాత్రంగా శాఖల సంబంధిత కార్యాలయాల్లో ఛాంబర్లు ఏర్పాటు చేసుకుని బాధ్యతలు తీసుకుంటున్నా, హైదరాబాద్‌లో తమ నివాసాల్లోనే ప్రజలను కలుసుకునేందుకు మక్కువ చూపుతున్నారు. 
మంత్రుల అడ్రస్ కోసం వెతుకాలట

సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్‌లో అధికారులకు అందుబాటులో ఉన్నట్లుగానే మంత్రులు మంత్రుల క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంటున్నారు.
1.మహమూద్‌ అలీ-ఏపీ డిజిపి కార్యాలయం లక్డీకాపూల్‌ 2.కెటిఆర్‌-మున్సిపల్‌ కాంప్లెక్స్‌,ఏసీ గార్డ్స్‌,మాసబ్‌ ట్యాంక్‌. 3.హరీష్‌రావు-అరణ్య భవన్‌,లక్డీకా పూల్‌, 4.సత్యవతి రాథోడ్‌-సంక్షేమ భవన్‌,5.గంగుల కమలాకర్‌-బీసీ కమిషన్‌, ఖైరతాబాద్‌, 6. పువ్వాడ అజ§్‌ు-రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌,ఖైరతాబాద్‌, 7.సబితా ఇంద్రారెడ్డి-ఎస్సీఈఆర్టీ,బషీర్‌బాగ్‌. 8.ఈటల రాజేందర్‌-బిఆర్కేఆర్‌ భవన్‌,9.ఇంద్రకరణ్‌రెడ్డి-ఎండోమెంట్‌ కార్యాలయం,బొగ్గులకుంట,ఆబిడ్స్‌. 10. కొప్పుల ఈశ్వర్‌-సంక్షేమ భవన్‌,11. ఎర్రబెల్లి దయాకర్‌రావు-రంగారెడ్డి జెడ్పీ కార్యాలయం,ఖైతరాబాద్‌. 12. జగదీష్‌రెడ్డి-టిఎస్‌ఎస్పీడిపిఎల్‌,మింట్‌ కాంపౌండ్‌ 13.నిరంజన్‌రెడ్డి-హాకా భవనం,లక్డీకాపూల్‌, 14.శ్రీనివాస్‌గౌడ్‌-రవీంద్రభారతి, లక్డీకాపూల్‌, 15.మల్లారెడ్డి-మహిళా శిశు సంక్షేమ భవన్‌,రోడ్‌ నెంబర్‌ 45,జూబ్లీహిల్స్‌. 16. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌-బీఆర్కేఆర్‌ భవన్‌,17.ప్రశాంత్‌రెడ్డి-ఈఎన్సీ,ఎర్రమంజిల్‌లో ఛాంబర్లను సర్దుబాటు చేసుకున్నారు.