తెలంగాణలో తమిళ రాజకీయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో తమిళ రాజకీయం

హైద్రాబాద్, అక్టోబరు 10 (way2newstv.com)
తెలంగాణలో తమిళ రాజకీయం.. ఆర్టీసి ఉద్యోగుల పట్ల కేసీఆర్ కఠిన నిర్ణయాలు.. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసి కార్మికుల  ఉద్యోగులతో కఠినంగా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రావు, ఉద్యోగ సంఘాల నుండి ప్రతిఘటన ఆడుకుంటున్నారు అంటే నిజమే అని  సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఆర్టీసి ఉద్యోగ సంఘాలు ఇలాగు అప్రకటిత సమ్మెకు దిగితే ఏకాఎకిన 900 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా అప్పటి సీఎం జయలలిత తొలగించారు. ఈ సంఘటనతో భయానికి గురైన ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట అసలు పట్టలేదు. అంతే కాకుండా ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంత తేలిగ్గా ప్రభుత్వంపై నిరసన తెలిపినట్లు కూడా లేదు.
తెలంగాణలో తమిళ రాజకీయం

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడని తెలుస్తోంది. గతంలో ఉద్యోగుల పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యవహరించినట్టుగానే  ఇప్పుడు   తెలంగాణలో సీఎం కేసీఆర్‌  వ్యవహరించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తమిళనాడుకు, తెలంగాణ రాష్టానికి చాలా తేడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంలో  ఆర్టీసి ఉద్యోగుల భాగస్వామ్యం కీలకంగా ఉందని అనేక సందర్బాల్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా ఒప్పుకున్నారు. ఆర్టీసి ఉద్యోగుల కాలిలో ముళ్లు గుచ్చుకుంటే తమ పంటితో తీస్తామనే ఘాటు సెంటిమెంట్ వ్యాఖ్యలు చేసిన సందర్బాలు కూడా  ఉన్నాయి. కాని పరిస్థితులు అందుకు పూర్తి స్థాయిలో బిన్నంగా మారిపోయాయి. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగణ రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వకంగా కాకుండా  కఠినంగా వ్యవహిరిస్తుందని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి.   ఆర్టీసీ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం కావడంతో  ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదనీ, ఆర్టీసీ సంస్థ కచ్చితంగా ఉండాలి అని  సీఎం చంద్రశేఖర్ రావు స్పష్టం చేస్తున్నారు.ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు  కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని, తదనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని  సీఎం తెలిపారు. క్రమశిక్షణను తూచా తప్పకుండా అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో కొన్ని అందుకోసమే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.   తెలంగాణలో ఉద్వాసనకు గురైన ఆర్టీసి కార్మికులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.