న్ఫ్యూజన్ లో రాయలసీమ తమ్ముళ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

న్ఫ్యూజన్ లో రాయలసీమ తమ్ముళ్లు

తిరుపతి, అక్టోబరు 19, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీకి చెందిన రాయలసీమ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైసీపీ అధికారంలోకి రావడంతో వారు నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? లేక అప్పుడప్పుడూ నియోజకవర్గాలకు వచ్చి వెళ్లడమే తప్ప ఎక్కువ సమయం వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు. రాయలసీమ జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండేది. 2014 ఎన్నికల్లోనూ రాయలసీమలో ఎక్కువ సీట్లు సాధించలేకపోయినా అనుకున్న స్థానాల్లో విజయం సాధించింది. దీంతో చంద్రబాబు రాయలసీమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.స్వయానా రాయలసీమ వాసి అయిన చంద్రబాబు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 
న్ఫ్యూజన్ లో రాయలసీమ తమ్ముళ్లు

కానీ గత ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతినింది. కర్నూలు, కడప జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి జీరో రిజల్ట్ వచ్చింది. వైసీపీ ఈ రెండు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి. అనంతపురం జిల్లాలో ఉరవకొండ, హిందూపురం రెండు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవగా, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం ఒక్కటే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు బీసీ జనార్థన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, టీజీ భరత్ వంటి నేతలు పూర్తిగా వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు. బీసీ జనార్థన్ రెడ్డి బిల్డర్ కావడంతో ఆయన ఎక్కువగా బెంగుళూరులోనే ఉంటున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి సయితం హైదరాబాద్, బెంగుళూరుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ తనయులిద్దరూ తమ వ్యాపారాలపై దృష్టి పెట్టి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు కూడా పార్టీకార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరును తీసుకుంటే ఎన్నికలకు ముందు వచ్చి పార్టీలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పూర్తిగా వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అమర్నాధరెడ్డి అడపా దడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ బెంగుళూరు టూర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన త్వరలోనే రాయలసీమ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కడప జిల్లాకు చంద్రబాబు రానున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు.