విశాఖపట్టణం, అక్టోబర్ 30, (way2newstv.com)
ఆయన బీజేపీని నమ్ముకుని జీవితపర్యంతం పనిచేశారు. ఏమీ లేని చోట పార్టీ మొక్క నాటి అది ఫలాలు ఇచ్చేసరికి మాత్రం ఫలితం అందుకోలేకపోయారు. ఆయనే విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఏపీ బీజేపీ తొలి అధ్యక్షుడు పీవీ చలపతిరావు. ఆయన దక్షిణాదికి వాజ్ పేయి లాంటి వారు. పార్టీ కోసం అరవై దశకం నుంచి ఎంతో కృషి చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన నాయకుడు. ఇంతచేసిన పీవీ చలపతిరావుకు వాజ్ పేయి అధికారంలోకి వచ్చినపుడు మాత్రం రాజ్యసభ మెంబర్ కానీ గవర్నర్ కానీ ఇస్తారనుకుంటే దాన్ని ఆయన చేతుల మీదుగా ఎదిగి జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వారే అడ్డుకున్నారని అంటారు. ఇక ఆయన ఏకైక కుమారుడు పీవీఎన్ మాధవ్ రాజకీయ వారసునిగా అదే పార్టీలో ఎదిగారు.
కమలానికి దూరమౌతున్న పాతతరం నేతలు
రెండేళ్ళ క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన గెలిచి తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు.ఇక విశాఖ బీజేపీ నుంచి చూసుకున్నపుడు పీవీఎన్ మాధవ్ యువకుడుగా గట్టి నాయకత్వాన్ని అందిస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీ కావడంతో పార్టీ హై కమాండ్ చూపు ఆయన మీద ఉంది. తాజాగా గాంధీ సంకల్పయాత్ర పేరిట విశాఖ జిల్లా అంతా మాధవ్ పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటూ పార్టీ పటిష్టతకు తండ్రిలాగానే క్రుషి చేస్తున్నారు. వెనకబడిన వెలమ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ బీజేపీకి గట్టి నాయకుడిగా కనిపిస్తున్నారు. అటు శాసనమండలిలో కూడా చంద్రబాబు కానీ జగన్ కానీ ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా అడిగి కడిగి పారేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న్నారు. కుటుంబం మొత్తం ఆరు దశాబ్దాలుగా బీజేపీలో ఉండడంతో జాతీయ నాయకత్వం చూపు కూడా మాధవ్ మీద ఉంది. ఆయన్ని ముందు పెడితే బీసీ ఓట్లు జమ అవుతాయన్న ఆశ ఉంది. తాజా పాదయాత్రతో విశాఖ బీజేపీ రాజకీయాల్లో మాధవ్ బాగా ముందుకు వచ్చేశారని అంటున్నారు.ఇదిలా ఉండగా బీజేపీలో పాతతరం క్రమంగా తప్పుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీ హరిబాబు ఇపుడు పార్టీలో పెద్ద మనిషిగా మాత్రమే ఉంటున్నారు ఆయన కేవలం జాతీయ కౌన్సిల్ మెంబర్ గా ఉంటున్నారు తప్ప జనంలోకి చొచ్చుకుపోలేకపోతున్నారు. ఆయన్ని రాజ్యసభ సభ్యున్ని చేసి ఢిల్లీ గడప తొక్కించినా పార్టీకి పెద్దగా ఉపయోగపడదని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. ఇక లక్కీగా 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు రూపేణ గెలిచిన విష్ణు కుమార్ రాజు సైతం వృధ్ధ తరం నాయకుడు అయిపోయారు. ఆయన సొంతంగా పార్టీని పరుగులు పెట్టించే సామర్ధ్యం కలిగి లేరన్నది కమలనాధులు కూడా పసిగట్టారు. ఇక మిగిలిన వారిలో అంతా అంగుష్టమాత్రులే ఉన్నారు . దాంతో బీజేపీలో ఇపుడు మళ్లీ పీవీ కుటుంబానికి ఆదరణ పెరిగిందని అంటున్నారు. రానున్న రోజుల్లో మాధవ్ కి మరింత కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. కొత్త నాయకత్వాన్ని అలా తయారు చేయాలని చూస్తున్నా