హైదరాబాద్ అక్టోబర్, 28 (way2newstv.com)
శారీరక శ్రమ లేకపోవడం వల్లే అనారోగ్యాల బారిన పడుతున్నారానా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు పాతబస్తీ సంతోష్ నగర్ లోని ఎఫ్ ఎస్ ఇండో క్రిన్ & డయాబెటిస్ సెంటర్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మారుతున్న జీవన శైలితో నే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు . గతంలో సోమత లేకే పేదలు చిరుధాన్యాలు తినేవారని. నేడు ఆరోగ్యం కోసం ధనవంతులే చిరుధాన్యాలను తింటున్నారని తెలిపారు.
జీవన శైలితోనే అనారోగ్యం
ప్రతి ఒక్కరూ శారీరక శ్రమతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే మధుమేహానికి దూరం గా ఉండవచ్చని సూచించారుహోం మంత్రి మహమ్మద్ అలీ మీడియా తో మాట్లాడుతూ పాతబస్తీలో డయాబెటిస్ తో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని పాతబస్తీలో డయాబెటిస్ సెంటర్ లు పెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదన్నారు . ఎఫ్ ఎస్ ఇండో క్రిన్& డయాబెటిస్ సెంటర్ ముందుకు రావడం తో వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ & చైర్మన్ డాక్టర్ షైస్తా ఫరిష్తా , డాక్టర్ శ్రీనివాస్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు