విశాఖపట్నం అక్టోబర్ 5 (way2newstv.com)
‘ప్రతి ఆటో వెనుక సీఎం జగన్ ఫొటో పెట్టుకోండి.. మీ జోలికి పోలీసులు రారు. కేసులూ ఉండవు. వైసీపీ అండగా ఉంటుంది’ అని పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆటోడ్రైవర్లకు సలహా ఇచ్చారు. గురజాడ కళాక్షేత్రంలో ఆటో కార్మికులకు ఆర్థిక సాయం అందించే వాహనమిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వయం ఉపాధిలో ఆటో కార్మికులది అగ్రస్థానమన్నారు.
ఆటో వెనుక జగన్ ఫొటో పెట్టుకోండి : మంత్రి ముత్తంశెట్టి
ఎంతో నిజాయితీగా ప్రయాణికులను గమ్యం చేరుస్తున్న వారిని ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. డబ్బున్న బడాబాబులకు గత ప్రభుత్వం ఎంతో చేసిందని, ఆటో కార్మికుల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. తమ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీకి అండగా నిలవాలని కోరారు. నాయకత్వ లక్షణాలు, ఆసక్తి వున్న ఆటో కార్మికులు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్నారు. అంతకుముందు మంత్రి కాసేపు ఆటో నడిపారు.
Tags:
Andrapradeshnews