సర్వే కోసం తిప్పలు (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సర్వే కోసం తిప్పలు (కరీంనగర్)

కరీంనగర్, అక్టోబర్ 29 (way2newstv.com): 
జిల్లా వ్యాప్తంగా సర్వే దరఖాస్తులు లక్షల కొద్దీ పెండింగ్ లో ఉంటున్నాయి. మీసేవాల ద్వారా భూమి యజమానులు ఇప్పటివరకు పెట్టుకున్న అర్జీలలో చాలావాటికి మోక్షం లభించడంలేదు. అన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో సర్వేయర్లున్నా సమస్యలు ఎక్కడికక్కడే అపరిష్కృతంగానే ఉన్నాయి. అర్జీ పెట్టుకున్నప్పటి నుంచి 45 రోజుల్లోనే సర్వేయర్లు స్థల పరిశీలన చేసి కొలతలు చూసి నివేదికను అందించాల్సి ఉన్నా జిల్లాలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇంకా 871 దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. ప్రతి నెలలో సగటున 150కిపైగా యజమానులు సర్వేకోసం పట్టు పడుతున్నారు. ఎప్పటికప్పుడు పరిష్కారం విషయంలో దాటవేత ధోరణి కనిపిస్తోంది. ఇటీవల కొత్తగా నియమితులైన సర్వేయర్లు కూడా శిక్షణ తరువాత విధిల్లో చేరారు. అయినా అన్ని మండలాల్లో కొలతల విషయంలో కలతలు తప్పడంలేదు. 
 సర్వే కోసం తిప్పలు (కరీంనగర్)

గట్టు పంచాయతీ ఉన్న రైతులతోపాటు అన్నివర్గాల వారు సర్వే కోసం అర్జీలు పెట్టుకున్నా.. క్షేత్రస్థాయిలో పరిశీలన విషయంలో మాత్రం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు సంబంధించిన వాటికి మాత్రం తొలి ప్రాధాన్య ఇస్తున్నారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. పైగా బడాబాబులు, స్థిరాస్తి వ్యాపారులకు సంబంధించిన వారికి అధిక ప్రాధాన్యతలుంటున్నాయని.. వాళ్ల భూముల  చొరవ చూపుతున్నారని, కాసుల వ్యవహారం తోపాటు పైరవీకారులకే తొలి పీఠ వేస్తున్నారనే విమర్శలు ఉన్నతాధికారుల చెవిని చేరుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా ప్రాజెక్టుల కోసం చేపట్టే సర్వేలతోపాటు ఇతరత్రా పని భారం వల్లనే సర్వేలు పూర్తికాలేదని అధికారులు సర్వేయర్లు చెబుతున్నా.. ప్రణాళికాయుతంగా వీటిని పరిష్కరించడం పెద్ద కష్టమైన పనికాదనే మాటలు ఆ శాఖ ఉన్నతాధికారుల నోటినుంచే వస్తున్నాయి. ఇప్పటికైనా వీలైనంత తొందరగా సర్వేల ప్రగతి పట్టాలెక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రెండేళ్ల కిందట సర్వే కోసం కట్టిన చలానా ప్రతుల్ని చూపిస్తున్న భూయజమాని పేరు మోహన్‌రెడ్డి. చొప్పదండి మండలం భూపాలపట్నం ఈయన స్వగ్రామం. 2017 అక్టోబరు 24వ తేదీన తనకున్న భూహద్దులను నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో భూమిని సర్వే చేయించాల్సిందిగా మీసేవాలో భూకొలతలు, సర్వే విభాగం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకుగానూ 5 సర్వే నంబరులకు సంబంధించి రూ.295 చొప్పున రూ.1475 రుసుమును చెల్లించాడు. వాస్తవానికి 45 రోజుల్లో కచ్చితంగా దరఖాస్తుదారు సమస్యని పరిష్కరించాల్సి ఉన్నా.. సుమారు 700 రోజులు కావస్తున్నా సర్వే చిక్కు వీడలేదు. నిత్యం అధికారుల్ని కలుస్తున్నా.. కార్యాలయాల చుట్టూ తిరగుతున్నా మోక్షం లభించడం లేదు.