హైదరాబాద్ అక్టోబర్ 25 (way2newstv.com):
తెలంగాణలో జరుగుతున్నల ఆర్టీసీ కార్మికుల సమ్మె మరో మలుపు తిరిగింది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్ను పరిష్కరించాలని సమ్మెబాట పట్టగా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచారు. అయితే ఆ కార్మికుల మరణాలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డే కారణమని తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్లోని కూకట్పల్లి పీఎస్ లో ఆర్టీసీ డ్రైవర్ కోరేటి రాజు ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అశ్వత్థామ రెడ్డిపై ఫిర్యాదు చేసిన డ్రైవర్
ఆయన్నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు సమ్మె పొడిగింపు వల్ల మాకు నష్టం జరుగుతుందని డ్రైవర్ రాజు అంటున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మాట్లాడుతూ కార్మికులకు మంచి అవకాశం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ బాగోలేదు అన్నారు.. ఆలోచిద్దామని రాజు అన్నాడు.అనుభవం లేని డ్రైవర్ల వలన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. అశ్వథామ రెడ్డి ఆర్టీసీ కార్మికుల లో విలీనం అనే విషాన్నీ నింపారు. యూనియన్ లీడర్ లు వెళ్లి మాట్లాడండి నేను మాత్రం విధులకు హాజరు అవుతాను. నన్ను ఎవరు ప్రలోభాలకు గురి చేయలేదని రాజు అన్నారు. మరోవైపు, కేసులకు భయపడేది లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ నేత లక్ష్మణ్ తో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతానన్నారు.