శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డిస్కో రాజా సాంగ్ కి అనూహ్యమైన స్పందన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డిస్కో రాజా సాంగ్ కి అనూహ్యమైన స్పందన

మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  వి ఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శరవేగంగా హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది..తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డిస్కో రాజా సాంగ్ కి అనూహ్యమైన స్పందన

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో బాల సుభ్రమణ్యం పాట పాడారు.. ఈ సాంగ్ పూర్తిగా రెట్రో ఫీల్ ని కలిగిస్తుంది..ఈ సాంగ్ లో లిరిక్స్ చాలా వాల్యూ తో కూడినవిగా విన్నవారంతా చెప్పటం విశేషం..అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ అతి త్వరలో విడుదల చేస్తారు..