గుంటూరు, అక్టోబరు 12, (way2newstv.com)
సత్తెనపల్లిలో కోడెల వారసులు ఎవరు..? కోడెల శివప్రసాదరావు కుటుంబ రాజకీయ ప్రస్ధానం దాదాపుగా ముగిసినట్లేనా..? టీడీపీలో ఆయన రాజకీయ వారసులకు ఎదిగే పరిస్థితి వుందా.? వ్యూహాత్మక రాజకీయాల్లో కోడెల శైలిని అనుసరించే నాయకుడు కానీ.. అందిపుచ్చుకొనే కుటుంబ సభ్యుల కానీ ఇక లేనట్టేనా..? కోడెల కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామన్న చంద్రబాబు నిజంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా..? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే గుంటూరు పోలిటికల్ స్క్రీన్ పై హట్ డిస్కషన్ గా నడుస్తున్నాయి. కోడెల శివప్రసాదరావు ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించారు. ప్రత్యేకంగా పల్నాడు పాలిటిక్స్ లో ఆయనదో ప్రత్యేక ముద్ర.
కోడెల వారసులపై చర్చోపచర్చలు
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్ధానంలో తనదైన మార్కును సొంతం చేసుకున్న రాజకీయ నేత. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఇంతకాలం పల్నాడుబాధ్యతలు అప్పగిస్తే కేడర్ ఎలా రియాక్ట్ అవుతుందన్న దానిపై అధిష్టానం నుంచి ఇంకా పూర్తి స్ధాయిలో స్పష్టతరాలేదు. ఇదిలా వుంటే కోడెల మృతికి ముందు నుంచే ఆయనతో పాటు కుమారుడు శివరాంను వ్యతిరేకిస్తూ సత్తెనపల్లిలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇప్పటికీ ఏ కార్యక్రమం జరిపిన అటు కోడెల నివాసంలో ఇటు పార్టీ కార్యాలయకొనసాగుతున్నాయి.మరో వైపు ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన రాయపాటి రంగారావు కొంతకాలంగా ఇక్కడి నుంచే పనిచేస్తున్నారు. ఇక నరసరావుపేట లో పోటీ చేసి ఓటమి చెందిన చదలవాడ అరవింద్ బాబు కూడా పార్టీలో యాక్టివ్ గా వున్నారు. ఇక ఇక్కడ శివరాంను ఇంచార్జ్ గా నియమించే అవకాశాలు కూడా ఎంత మాత్రం లేవన్నది కార్యకర్తల అభిప్రాయం గా కనిపిస్తుంది. మరి పరిస్థితుల కోడెల వారసుల రాజకీయ భవిష్యత్తుపై అదిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.